బాలీవుడ్ లో ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా కూడా అక్షయ్ కుమార్ కి క్రేజ్ డిఫరెంట్ అని చెప్పాలి. నెగిటివ్ టాక్ లేకుండా మినిమమ్ పాజిటివ్ హిట్స్ అందుకుంటూ తన మార్కెట్ ని పెంచుకుంటూ వెళుతున్నాడు. 2019లో ఫోర్బ్స్ లిస్ట్ లో టాప్ ప్లేస్ దక్కించుకున్న అక్షయ్ హాట్ టాపిక్ గా మారాడు. 2019లో అక్షయ్ కుమార్ వరుసగా నాలుగు డిఫరెంట్ సినిమాలు చేశాడు. కేసరి, మిషన్ మంగళ్, హౌస్ ఫుల్ 4 తాజాగా గుడ్ న్యూస్ సినిమాలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్నాయి.

బాలీవుడ్ లో గత ఏడాది విడుదలైన టాప్ టెన్ మూవీస్ లో అక్షయ్ కుమార్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన గుడ్ న్యూస్ సినిమా ఇప్పటికే 100కోట్లను దాటేసింది.  వార్ - కబీర్ సింగ్ వంటి సినిమాల తరువాత నిర్మాతలకు అత్యధిక లాభాలని అందించిన సినిమాలో అక్షయ్ కుమార్ సినిమాలు నాలుగు ఉన్నాయి. కేసరి, మిషన్ మంగళ్, హౌస్ ఫుల్ 4 తాజాగా గుడ్ న్యూస్ కూడా చిత్ర యూనిట్ కె కాకుండా బయ్యర్స్ కి సైతం సంతోషాన్ని ఇచ్చింది.

ప్రస్తుతం థియేటర్స్ లో గుడ్ న్యూస్ సినిమా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.  చూస్తుంటే ఈ సినిమా కూడా ఈజీగా 200కోట్ల వసూళ్లను సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తంగా 2019లో అక్షయ్ కుమార్ తన సినిమాలతో 700కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం మూడు సినిమాల షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సూర్యవంశీ, లక్ష్మీ బాంబ్, పృథ్వీ రాజ్ అనే చిత్రాలతో పాటూ మరో చిత్రంతో అక్షయ్ బిజీగా ఉన్నాడు. ఇందులో మూడు సినిమాలు ఇదే ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.