టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మన్మథుడు 2తో ఊహించని డిజాస్టర్ ఎదుర్కొన్న కింగ్ నెక్స్ట్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. బిగ్ బాస్ షో దాదాపు ఎండింగ్ కి వచ్చేసింది. మరో రెండు వారాల్లో ఫైనల్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. అయితే సినిమాలకు సంబందించిన పనులను వీలైనంత స్టార్ట్ చేసుకోవాలని నాగ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నట్లు గతంలోనే ఓ క్లారిటీ ఇచ్చిన నాగ్ ఇప్పుడు మరో హిందీ రీమేక్ పై కూడా కన్నేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచినా రెయిడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి నాగ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అయితే ఆ సినిమా దర్శకుడు ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదు.

ఇక సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ బంగార్రాజు  స్క్రిప్ట్ పనులు దాదాపు ఎండింగ్ కి వచ్చేసినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్ కోసం నటీనటులను అలాగే ఇతర విభాగాల్లో టెక్నీషియన్స్ ని ఫైనల్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగార్జున బంగార్రాజుతో అంతకంటే బిగ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. నాగ చైతన్య కూడా ఆ సినిమాలో కీలకపాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది. నెక్స్ట్ వీక్ లో రెండు సినిమాలకు సంబందించిన వివరాలను నాగ్ బయటపెట్టనున్నట్లు తెలుస్తోంది.