నాగ ఛైతన్య - సమంత మరోసారి జంటగా సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతున్నట్లు తెలుస్తోంది.  ఏ మాయ చేసావే సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ సమంత. అదే సినిమాతో మొదటి సక్సెస్ అందుకున్న హీరో నాగ చైతన్య.  ఆ సినిమా ద్వారానే లవర్ బాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఆ సినిమాతో వారి మధ్య పెరిగిన పరిచయం ప్రేమగా మారి మూడుముళ్ల బంధం వరకు తీసుకెళ్లింది.  ఆ తరువాత మనం - ఆటో నగర్ సూర్య వంటి సినిమాల్లో కనిపించి ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేశారు. చాలా గ్యాప్ తరువాత ఇటీవల వీరి కలయికలో వచ్చిన చిత్రం మజిలీ. ఆ సినిమా గత సినిమాల కంటే మంచి విజయాన్ని అందుకుంది.

మొదటి రోజే కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన సినిమాలు

ఇక మరోసారి చై శామ్ జోడి లవ్ బర్డ్స్ గా కనిపించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  ఆ సినిమాతో పాటే మరో సినిమాని పట్టాలెక్కించేందుకు చైతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల గీత గోవిందం దర్శకుడు చెప్పిన ప్రాజెక్ట్ కి చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా వచ్చింది. దీంతో సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ సమంతని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. త్వరలోనే ఈ కాంబినేషన్ పై స్పెషల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది. ఇక చియాతు నుంచి ఇటీవల వచ్చిన వెంకిమామ బాక్స్ ఆఫీస్ వద్ద ఘానా విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.