Asianet News TeluguAsianet News Telugu

viral:స్టైజీపైనే హీరోయిన్ తో చైతూ ‘చిలిపి’నవ్వులు, దొంగచూపులు వీడియో!


 ఈ వేడుకలో నాగార్జున మాట్లాడుతున్న టైమ్ లో… ఒక్కసారిగా నాగచైతన్య వెనక్కి తిరిగి... హీరోయిన్ దక్ష నాగర్కర్ ను చూడగా, దానికి ‘ఏమిటి’ అన్న భావనలో దక్ష చేసిన కనుసైగలు చేసింది. 

Akkineni naga chaitanya smile in bangarraju event
Author
Hyderabad, First Published Jan 11, 2022, 10:37 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


సమంతతో విడాకులు మొదలైన నాటి నుంచి అక్కినేని వారసుడు నాగచైతన్య ఏదో విధంగా రోజూ వార్తల్లోనూ, సోషల్ మీడియాలోనూ నలుగుతున్నారు. తాజాగా మరోసారి  “బంగార్రాజు” మ్యూజికల్ నైట్ లో చోటు చేసుకున్న చిన్న విషయం ..వీడియోగా వైరల్ అవుతోంది. అందులో వైరల్ అవ్వాల్సినంత విషయం ఏముంది..అసలేం జరిగింది..ఆ వీడియో ఏమిటో చూద్దాం. 

కరోనా కారణంగా 'ఆర్ ఆర్ ఆర్' .. 'రాధేశ్యామ్' బరి నుంచి తప్పుకున్నాయి. అదృష్టవంతుడికి అడ్డంకులు ఉండవు అన్నట్టుగా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'బంగార్రాజు' రెడీ అయ్యాడు. సీనియర్ హీరోయిన్లలో రమ్యకృష్ణకి ఎంత ఫాలోయింగ్ ఉందో .. యూత్ లో కృతిశెట్టికి అంతటి క్రేజ్ ఉండటం ఈ సినిమాకి మరింతగా కలిసొచ్చే అంశం. అప్పటి వరకూ కరోనా తీవ్రత పెరగకపోతే, టాలీవుడ్ లో 'బంగార్రాజు' అంతటి అదృష్టవంతుడు ఉండడని అంటున్నారు. ఈ నేపధ్యంలో “బంగార్రాజు” మ్యూజికల్ నైట్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. 

 ఈ వేడుకలో నాగార్జున మాట్లాడుతున్న టైమ్ లో… ఒక్కసారిగా నాగచైతన్య వెనక్కి తిరిగి... హీరోయిన్ దక్ష నాగర్కర్ ను చూడగా, దానికి ‘ఏమిటి’ అన్న భావనలో దక్ష చేసిన కనుసైగలు చేసింది. ఆ వెంటనే  చైతూ చిలిపి నవ్వులుతో ఆమెను చూసాడు. దానికి రెస్పాన్స్ గా హీరోయిన్ దక్ష స్మైల్స్… మొత్తంగా ఈ చిన్న కొద్ది సెనక్ల మ్యాటర్.. ఈవెంట్ కే హైలైట్ అయిపోయింది. వీరిద్దరి ‘మూగ సైగలు’ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 

ఇంత చిన్న మేటర్ వైరల్ అవ్వటానికి ప్రధాన  కారణం సమంతతో విడాకులు తర్వాత బహిరంగ వేదికపై కనిపించిన నాగచైతన్య, ఈ విధంగా ఓ హీరోయిన్ తో సిగ్గుపడుతూ చిరునవ్వులు చిందించడంమే. ఇది చూసిన నెటిజన్లు .. బ్యాక్ గ్రౌండ్ లో ఏదో  కధ నడుస్తోందంటున్నారు.  

 'బంగార్రాజు' విషయానికి వస్తే...  దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఈ సినిమా కథ విషయంలో నాగార్జునను మెప్పించడానికీ ... ఆ తరువాత అనేక కారణాల వలన సెట్స్ పైకి రావడానికి చాలా సమయం పట్టింది. ఇక సెట్స్ పైకి వచ్చిన తరువాత మాత్రం నాగార్జున ఆలస్యం కానివ్వలేదు. ఇది గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ .. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వెంటనే కనెక్ట్ అయ్యే కథ. అందువలన ఆయన ఎలాగైనా ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపాలని బలంగా నిర్ణయించుకున్నారు. అందువల్లనే ఒక వైపున షూటింగు జరుగుతూ ఉండగానే, వెంటవెంటనే అప్ డేట్స్ వదులుతూ వచ్చారు. ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయ్యింది.

గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొందింది. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు. రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్స్. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించటం, ‘సోగ్గాడే..’కి ప్రీక్వెల్‌ కావటంతో ‘బంగార్రాజు’ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.   ''బంగార్రాజు''  నుంచి ఇప్పటికే విడుదలైన- పాటలు - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సత్యానంద్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios