పలు భాషల్లో అక్కినేని అమల 90వ దశకంలో హీరోయిన్ గా అలరించింది. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా అమల నటించారు. నాగార్జునతో వివాహం తర్వాత అమల సినిమాలకు దూరమయ్యారు. చాలా గ్యాప్ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో అమల వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో హీరో తల్లి పాత్రలో అమల అలరించింది. 

ప్రస్తుతం అమల మరో చిత్రానికి రెడీ అవుతోంది. యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం డెబ్యూ దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. 

తాజా సమాచారం మేరకు అమల ఈ చిత్రంలో శర్వానంద్ తల్లిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. తాజా షెడ్యూల్ లో అమల కూడా జాయిన్ అయిందట. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలోల్ తల్లిగా మెరిసిన అమలకు మరోసారి అలాంటి పాత్రలోనే అవకాశం వచ్చింది. 

ఇక తమిళనటుడు, సంగీత దర్శకుడు అనిరుధ్ తండ్రి రవి రాఘవేంద్ర కూడా ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం శర్వానంద్, అమల, రాఘవేంద్ర మధ్య వచ్చే సన్నివేశాలని దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. పెళ్లి చూపులు చిత్రంలో అలరించింది రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. శర్వానంద్ నుంచి త్వరలో 96 రీమేక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించింది.