అక్కినేని యువవారసుడు అఖిల్ నటిస్తున్న నాల్గవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శత్వంలో తెరకెక్కుతోంది. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అఖిల్ నటించిన తొలి మూడు చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. ఈసారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని అఖిల్ డిసైడ్ అయిపోయాడు. 

అందుకే బొమ్మరిల్లు భాస్కర్ ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా కంటెంట్ ని నమ్ముకుని రాబోతున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయింది. అఖిల్ కు జోడిగా ఈ మూవీలో ప్రస్తుతం సూపర్ స్టార్ డమ్ తో దూసుకుపోతున్న పూజా హెగ్డే నటిస్తోంది. ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ కాంబినేషన్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

తాజాగా చిత్ర యూనిట్ అఖిల్ నాల్గవ చిత్ర టైటిల్ ఖరారు చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. అఖిల్ చిత్రానికి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ మొదటి అడుగు ఫిబ్రవరి 8న పడబోతోంది అంటూ మరో ఆసక్తికర అప్డేట్ కూడా ఇచ్చారు. ఫిబ్రవరి 8 సాయంత్రం 6:18 గంటలకు తొలి అడుగు పడబోతోంది అని ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. 

బహుశా ఆరోజు ఫస్ట్ లుక్, టీజర్ లాంటిదేమైనా రిలీజ్ చేయొచ్చు. ఈ టైటిల్ లోగోలో అఖిల్ కాళ్ళని మాత్రమే చూపించారు. ఫన్, ఫ్యామిలీ, లవ్ ఎలిమెంట్స్ తో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది.