అక్కినేని యువహీరో అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం తరువాత భాస్కర్ కి అవకాశం దక్కడంతో ఆ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. అఖిల్ కూడా తన ఆశలన్నీ ఈ ప్రాజెక్ట్ పైనే పెట్టుకున్నాడు. కెరీర్ మొదలై ఏళ్ళు గడుస్తున్నా ఇంకా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోలేదని బాధపడుతున్నాడు.

గీత ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుండడం జనాల్లో కాస్త ఆసక్తిని కలిగించే అంశం. ఎలాగైనా ప్రమోషన్స్ తోనే సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే.. సినిమాకు సంబందించిన మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమాలో అరవింద సమేత హీరోయిన్స్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూజ హెగ్డే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక మరొక హీరోయిన్ గా ఈషా రెబ్బను ఫైనల్ చేసినట్లు సమాచారం. అరవింద సమేత సినిమాలో ఈ ఇద్దరు సిస్టర్స్ గా కనిపించారు. ఇక మరోసారి అనుకోని విధంగా ఈషా రెబ్బ పూజా హెగ్డే తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. మరీ సెకండ్ టైమ్ ఈ కాంబో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇకపోతే సినిమాకు సంబందించిన మరో షెడ్యూల్ ని ఈ నెల 12న స్టార్ట్ చేయనున్నారు. మార్చ్ వరకు అన్ని పనులని ముగించి సమ్మర్ కానుకగా సినిమాని విడుదల చేయాలని చూస్తున్నారు.