Asianet News TeluguAsianet News Telugu

CCL : మరోసారి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విజేతగా నిలిచిన తెలుగు వారియర్స్.. ఫైనల్ పోరులో భోజ్‌పురిపై ఘన విజయం..

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023లో తెలుగు వారియర్స్ మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్ పై తెలుగు వారియర్స్ 9 వికెట్ల తేడాతో  ఘనవిజయం సాధించింది. 

Akhil Akkineni-led Warriors Proud Champions of CCL 2023
Author
First Published Mar 26, 2023, 12:16 AM IST

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023 ఛాంపియన్‌షిప్‌ను తెలుగు వారియర్స్ కైవసం చేసుకుంది. వైజాగ్‌లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్ పై తెలుగు వారియర్స్ 9 వికెట్ల తేడాతో  ఘనవిజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన పోరులో తెలుగు వారియర్స్ జట్టు అలవోకగా టైటిల్‌ను సొంతం చేసుకొన్నది. ఈ విజయంలో తెలుగు వారియర్స్ నాల్గవసారి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. కెప్టెన్ అఖిల్ అక్కినేని బ్యాట్‌తో అద్భుతమైన అర్ధశతకంతో ముందుండి నడిపించాడు. ఆఖరి ఎన్‌కౌంటర్‌లో అఖిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. 

ఈ మ్యాచ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..  తెలుగు వారియర్స్ , భోజ్‌పురి దబాంగ్స్‌ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో .. తొలుత టాస్‌ గెలిచిన తెలుగు వారియర్స్‌ బౌలింగ్‌ తీసుకుంది. దీంతో బ్యాటింగ్‌కు వచ్చిన భోజ్‌పురి  6 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసి తొలి ఇన్సింగ్స్ ముగించింది. ఆ బ్యాటింగ్‌కు వచ్చిన తెలుగు వారియర్స్  ప్రారంభం నుంచే మంచి ఫామ్ లో ఉంది. ప్రధానంగా  తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు కెప్టెన్ అఖిల్‌ అద్భుతంగా రాణించాడు. 67 పరుగులు చేసి.. జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో తెలుగు వారియర్స్  4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా బ్యాటింగ్‌కు వెళ్లిన భోజ్‌పురి దబాంగ్స్‌ టీం 6 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. అనంతరం .. 58 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా తెలుగు వారియర్స్ బ్యాటింగ్‌కు దిగింది. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి.. విజయం సాధించింది. దీంతో సీసీఎల్‌ టోర్నీలో నాలుగో టైటిల్‌ విజేతగా తెలుగువారియర్స్ నిలిచింది. ఈ సారి సిరీస్ కైవసం చేసుకుని.. సీసీఎల్‌ చరిత్రలో అత్యధికంగా నాలుగు టైటిల్స్‌ కైవసం చేసుకుని టీమ్ గా తెలుగు వారియర్స్‌  సరికొత్త చరిత్ర సృష్టించింది. 

సిరీస్‌ బెస్ట్ ఆఫ్ బెస్ట్స్

* బెస్ట్‌ బౌలర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: తమన్‌

* బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ఆదిత్య ఓజా (భోజ్‌పురి)

* మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అఖిల్‌ అక్కినేని

* మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌: అఖిల్‌ అక్కినేని

* ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ ది సీజన్‌: తమన్‌

* బెస్ట్‌ బౌలర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌: ప్రిన్స్‌

* బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌: ఆదిత్య ఓజా(భోజ్‌పురి)

Follow Us:
Download App:
  • android
  • ios