విలక్షణ దర్శకుడు రామ గోపాల్ వర్మ కాన్సెప్ట్ సినిమాలంటే కాంట్రవర్సీ సినిమాలతో రచ్చ చేస్తుండడం రొటీన్ అయిపొయింది. అయితే జనాలు పట్టించుకోవడం లేదని అనుకున్నాడో ఏమో గాని పాత్రలకు సంబందించిన అప్డేట్స్ తో షాక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

 

ఆ సినిమాలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ అలాగే మరికొంత మంది పాత్రలను రివీల్ చేసిన ఆర్జీవీ ఇప్పుడు వైఎస్ జగన్ పాత్రతో జనాలని ఎట్రాక్ట్ చేస్తున్నాడు. జగన్ పాత్రలో మలయాళం యాక్టర్ అజ్మల్ అమీర్ కనిపించబోతున్నాడు. అజ్మల్ గతంలో రంగం - రచ్చ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ బాగా దగ్గరైన విషయం తెలిసిందే.ప్రస్తుతం అతని పాత్రకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  దాదాపు జగన్ హవాబావాలని ఈ యాక్టర్ దింపేశాడనిపిస్తోంది.

వర్మ మరోసారి తన మేకింగ్ స్టైల్ ని నీరుపించుకోబోతున్నట్లు అర్ధమవుతోంది. ఇఇక సినిమా ట్రైలర్ ని దర్శకుడు  ఈ నెల 27న ఉదయం 9గంటల 36నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నాడు. మరి ఈ కాంట్రవర్సీ సినిమాతో  రామ్ గోపాల్ వర్మ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.