Asianet News TeluguAsianet News Telugu

షాక్ ఇచ్చిన అజిత్..దిల్ రాజు తొందరపడతారా?

త‌మిళ చిత్రం తినువుకు అనువాదంగా విడుద‌ల‌వుతోన్న ఈ సినిమాకు హెచ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు. బ్యాంక్ రాబ‌రీ బ్యాక్‌డ్రాప్‌లో ట్రైల‌ర్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. 

Ajith surprises everyone with the release date
Author
First Published Jan 5, 2023, 6:11 AM IST


 అజిత్ హీరోగా న‌టించిన తెగింపు సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా రిలీజ్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతికి వచ్చే సినిమాల పోటి ఓ రేంజిలో ఉంటుందని అజిత్ కు తెలుసు. అటు తమిళం నుంచి, ఇటు తెలుగు నుంచి థియేటర్స్ సమస్య ఉంటుంది. ముఖ్యంగా మరో స్టార్ హీరో విజయ్ తో అన్ని విషయాల్లో పోటి ఉంటుంది. థియోటర్స్ పంపకం ఉంటుంది. తెలుగులో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు వస్తూండటంతో అది మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు తమ రిలీజ్ విషయంలోనే మార్పులు చేసుకోవాలని డిసైడ్ అయ్యి ప్రకటన చేసి అందరని ఆశ్చర్య పరిచారు. 

వివరాల్లోకి వెళితే...తమిళ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తెగింపు’ కోసం తమిళ అభిమానులు తో పాటు తెలుగు వారు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కిస్తుండటంతో ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వారి అంచనాలకు ఏమాత్రం తగ్గుకుండా ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

దాంతో తెగింపు  చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ఈ సినిమాకు వస్తున్న  బిజినెస్ చూసి, ఈ సినిమాను అనుకున్నదానికంటే ముందుగానే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే అజిత్ తునివు చిత్రాన్న జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. దీంతో పొంగల్ రిలీజ్ లలో అజిత్ ముందుగా దిగుతున్నాడు. ఈ మేరకు నిర్మాత బోనీ కపూర్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశాడు.  

 

‘వారసుడు’ కూడా జనవరి 11వ తేదీకే ముందుకు వెళ్లే అవకాశం ఉందని తెలిస,్తోంది. అలా చేస్తే తెలుగులో ‘వారసుడు’కు కూడా కలిసొస్తుంది. ఎందుకంటే 12న వస్తే బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’తో స్క్రీన్స్ షేర్ చేసుకోవాలి. 11వ తేదీన అయితే ‘వారసుడు’కు ఒకరోజు ఫ్రీ రన్ దొరుకుతుంది. తెలుగులో అజిత్ మార్కెట్ కూడా గొప్పగా ఏమీ లేదు.  విజయ్ ది కూడా తెలుగు మార్కెట్ అంతంత మాత్రమే. కాబట్టి దిల్ రాజు కూడా ‘వారిసు’ను ఒకరోజు ముందుకు జరిపే అవకాశం ఉంది. ‘తునివు’ తెలుగు వెర్షన్ ‘తెగింపు’ కూడా జనవరి 11వ తేదీనే విడుదల అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ అంటోంది. చూడాలి ఏం జరగనుందో.
 

Follow Us:
Download App:
  • android
  • ios