తలా అజిత్ క్రేజ్ గత కొన్నేళ్లలో పెరుగుతూ వచ్చింది. అజిత్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తుండటంతో అజిత్ క్రేజీ హీరోగా మారిపోయాడు. అజిత్ మ్యానరిజమ్స్, స్టయిల్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఇక అజిత్ వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. 

అజిత్ లాంటి సూపర్ స్టార్స్ వారసులకు కూడా అభిమానుల్లో అంతే క్రేజ్ ఉంటుంది. తాజాగా అజిత్ ముద్దుల కుమారుడు అద్వైక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాడు. అజిత్ కు ఇద్దరు పిల్లలు. కుమార్తె పేరు అనౌష్క కాగా.. తనయుడి పేరు అద్వైక్. అజిత్ పిల్లలు ఇద్దరూ ఇటీవల సరదాగా తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

క్యూట్ లుక్ తో అదరగొడుతున్న అద్వైక్ ని చూసి అజిత్ అభిమానులు మురిసిపోతున్నారు. మరీ ఇంత క్యూట్ గా ఉంటే దిష్టి తగులుతుంది అని కామెంట్స్ పెడుతున్నారు. పాలబుగ్గలు, అందమైన చిరునవ్వుతో అద్వైక్ వెలిగిపోతున్నాడు. 

అజిత్ 2000 సంవత్సరంలో నటి షాలినిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి సంతానమే అద్వైక్, అనౌష్క. వీరమ్, వేదాళం, వివేకం, విశ్వాసం లాంటి వరుస విజయాలతో అజిత్ దూసుకుపోతున్నాడు.