సినిమా ఇండస్ట్రీలో డబ్బుతో కూడిన అనుబంధాలే ఉంటాయని అందరూ కామెంట్ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు స్టార్స్ కూడా డబ్బును లెక్క చేయకుండా పని చేస్తుంటారు. ఎంత స్నేహితుడైనా బందువైనా రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా సినిమా చేయడం అనేది చాలా అరుదు. అయితే RRRలో నటించడానికి బాలీవుడ్ స్టార్ హీరో కూడా ఒక్క రూపాయి తీసుకోలేదట.

ప్రస్తుతం ఇండియన్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది, అజయ్ దేవ్ గన్ రాజమౌళి గత కొంత కాలం నుంచి మంచి స్నేహితులు. ఈగ సినిమాను బాలీవుడ్ లో రిలీజ్ చేసినప్పుడు అజయ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే ప్రమోషన్స్ కూడా చేశాడు. ఇక RRR సినిమాలో నటించడానికి అజయ్ రాజమౌళి కారణంగానే రెమ్యునరేషన్ తీసుకోలేదట. ముందు నుంచి రాజమౌళితో మంచి స్నేహం ఉండడం వల్ల కొన్ని నిమిషాల గెస్ట్ రోల్ కి అజయ్ కి పారితోషికం తీసుకోలేదట.

సినిమాలో నటించడానికి సైన్ చేసినప్పుడు దానయ్య రెమ్యునరేషన్ ఇస్తానని అన్నప్పటికీ అజయ్ ఒప్పుకోలేదట. సాధారణంగా అజయ్ బాలీవుడ్ లో ఒక్కో సినిమాకు 35 నుంచి 40కోట్లు వరకు తీసుకుంటారని టాక్. అయితే ఆయన మార్కెట్ కి తగ్గట్టుగా ఇవ్వాలని దర్శకుడు కూడా  జరిపినప్పటికీ అజయ్ ఒప్పుకోలేదట. మరీ ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.