పాన్ ఇండియా అనేది ఇప్పుడు కామన్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా భాషతో సంబంధం లేకుండా సినిమాలు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్నాయి. మిగతా ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ ఇతర భాషల్లోకి సినిమాలను డబ్ చేస్తున్నారు. అలాగే మార్కెట్ తో సంబంధం లేకుండా మంచి అవకాశాలు వస్తే.. వేరే భాషల్లో అతిధి పాత్రలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు.

ఇకపోతే RRR సినిమా ద్వారా టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గన్ కూడా అదే తరహాలో అడుగులు వేస్తున్నాడు. మొన్న RRR షూటింగ్ లో అలా అడుగుపెట్టాడో లేదో అప్పుడే తన తదుపరి సినిమాని తెలుగులో డబ్ చేయడానికి రెడీ అయ్యాడు. గోల్డెన్ డేస్ ఫుట్ బాల్ (1952-62) బ్యాక్ డ్రాప్ లో అజయ్ దేవగన్ కొత్త చిత్రం తెరక్కుతున్న సంగతి తెలిసిందే.

రీసెంట్ గా మైదాన్ అని టైటిల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.   తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళంలో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ అజయ్ దేవ్ గన్ సతీమణిగా కనిపించబోతోంది. ఈ సినిమాతో ఎలాగైనా బాలీవుడ్ లో సక్సెస్ అందుకోవాలని కీర్తి ఆశపడుతోంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోణి కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించనున్నారు. సినిమా షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి 2020 నవంబర్ 27న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసుకుంటున్నారు.