Asianet News TeluguAsianet News Telugu

పెద్ద సినిమాని పట్టించుకోకుండా...బూతు సినిమాకే జనం క్యూ

బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా హిట్ అవుతుంది అనేది ఎప్పుడూ సినిమావాళ్ళకు క్వచ్చిన్ మార్కే. బూతే చాలా సార్లు రాజ్యమేలుతూంటుంది. అంతెందుకు కబీర్ సింగ్ ని బాలీవుడ్ క్రిటిక్స్ మొత్తం ఏకేసారు కానీ కలెక్షన్స్ వైజ్ గా ఈ సినిమా టాప్ లో నిలిచి షాక్ ఇచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ లో మరోసారి అలాంటి ఫీటే జరిగింది. 

Adult Comedy Wins Bollywood  Box Office
Author
Hyderabad, First Published Dec 7, 2019, 7:59 PM IST

బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా హిట్ అవుతుంది అనేది ఎప్పుడూ సినిమావాళ్ళకు క్వచ్చిన్ మార్కే. బూతే చాలా సార్లు రాజ్యమేలుతూంటుంది. అంతెందుకు కబీర్ సింగ్ ని బాలీవుడ్ క్రిటిక్స్ మొత్తం ఏకేసారు కానీ కలెక్షన్స్ వైజ్ గా ఈ సినిమా టాప్ లో నిలిచి షాక్ ఇచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ లో మరోసారి అలాంటి ఫీటే జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రిలీజైన సినిమాని ఓ బూతు సినిమా ఓపినింగ్స్, కలెక్షన్స్ తో భాక్సాఫీస్ దగ్గర గెలిచి కాలర్ ఎగరేసింది.

భారతదేశ చరిత్రలో చెప్పుకోదగ్గ మూడో పానిపట్‌ యుద్ధం ఆధారంగా ‘పానిపట్‌’ అనే హిందీ  చిత్రం తెరకెక్కింది. మాస్‌, రొమాంటిక్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ ఇందులో మరాఠా యోధుడు సదాశివ్‌ రావ్‌ భవ్‌గా నటించారు. చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన అశుతోష్‌ గొవారికర్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ‘మొహంజొదారో’తో ప్రేక్షకులను నిరుత్సాహపర్చిన అశుతోష్‌.. ఈ చిత్రంతో తిరిగి లైమ్ లైట్ లోకి వస్తాడని భావించారు.

అలాగే వరుస ఫ్లాఫ్ లతో సతమతవుతున్న అర్జున్‌ కపూర్‌కి ఈ చిత్రం బ్రేక్‌  ఇస్తుందని భావించాడు. అయితే ఈ సినిమా ఆ రెండు చెయ్యలేకపోయింది. ఈ సినిమా తొలిరోజు 3.75 కోట్లు నెట్ కలెక్షన్స్ తెచ్చుకుంది. ఎంతో ఎక్సపెక్ట్ చేసిన ఈ సినిమా అలా దెబ్బ కొట్టడంతో బాలీవుడ్ భారంగా ఓ నిట్టూర్పు విడిచింది.  అదే రోజున  అడల్ట్ కామెడీ చిత్రం  ‘పతీ, పత్నీ ఔర్‌ వో’ రిలీజైంది. కార్తీక్‌ ఆర్యన్‌, భూమి పడ్నేకర్‌, అనన్య పాండేలు నటించిన ఈ  తాజా బాలీవుడ్ మూవీ ‘పతీ, పత్నీ ఔర్‌ వో’ మంచి ఓపినింగ్స్ రాబట్టుకుంది.

ముదస్సర్‌ అజిజ్‌ దర్శకత్వంలో, టీ-సిరీస్ ఫిల్మ్, బీ.ఆర్.స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీ షాకిచ్చే కలెక్షన్స్  అందించింది.  తొలి రోజు 9.10 కోట్లు కలెక్షన్సో తో దుమ్ము దులిపింది. దాంతో అంత పెద్ద స్టార్ కాస్టింగ్, పెద్ద డైరక్టర్ ఉన్న సినిమా ప్రక్కన పెట్టి ఈ సినిమాకు వెళ్లటంతో బూతుకు ఉన్న ఆకర్షణ బాలీవుడ్ కు మరో సారి తెలిసివచ్చింది.

1978లో వచ్చిన సూపర్‌హిట్‌ సినిమా ‘పతీ, పత్నీ ఔర్‌ వో’ ను అదే పేరుతో  ఈ దర్శకుడు తెరకెక్కించారు. అప్పటి సినిమాను, ఇప్పటి సినిమాను కూడా బీఆర్‌ చోప్రా ఫిలిమ్స్‌ నిర్మించడం విశేషం. పాత సినిమా కథకు ఏమాత్రం సంబంధంలేకుండా సరికొత్త నేపథ్యంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శకుడు చెప్పారు..కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ  డిసెంబర్ 6న విడుదల అయ్యింది.

Follow Us:
Download App:
  • android
  • ios