నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం రూలర్. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా వేదిక, సోనాల్ చౌహన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. 

బాలకృష్ణ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా, కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ గా రెండు లుక్స్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులని ఆకట్టుకుంది. క్రిస్టమస్ కానుకగా రూలర్ చిత్రాన్ని డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకే చిత్ర యూనిట్ ప్రకటించింది. 

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని వేగవంతం చేసింది. తాజాగా ఈ చిత్రంలోని 'అడుగడుగో' అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. మంచి మాస్ బీట్ తో బాలయ్య క్యారెక్టర్ ని ఎలివేట్ చేసే విధంగా సాంగ్ ఉంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారు. 

చిరంతన్ భట్ రూలర్ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. సాయిచరణ్ ఈ పాటకు గాత్రాన్ని అందించారు. కార్పొరేట్ లుక్ లో కనిపిస్తున్న బాలయ్యని వర్ణించేలా ఈ సాంగ్ మొత్తం సాగుతుంది. 

సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు.