చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మానవాళి పెను విపత్తుని ఎదుర్కొంటోంది. కరోనా కారణంగా లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇండియాలో కూడా కరోనా ప్రభావం కొనసాగుతోంది. కరోనా కారణంగా ఇండియాలో లాక్ డౌన్ విధించారు. దీనితో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. 

ప్రభుత్వాలు, సెలెబ్రిటీలు, క్రీడాకారులు, కళాకారులు  ప్రజలని అప్రమత్తం చేస్తూ జాగ్రత్తలు చెబుతున్నారు. మరికొందరు సెలెబ్రిటీలు తమ ఇళ్లల్లో ఉంటూ క్వారంటైన్ విశేషాలని పంచుకుంటున్నారు. తాజాగా క్రేజీ హీరోయిన్ అతిధి రావు హైదరి ఆసక్తికర పోస్ట్ పెట్టింది. 

మాయమాటలతో యంగ్ హీరోయిన్ ని కంట్రోల్ చేస్తున్న స్టార్ హీరో ?

అతిధి రావు అద్భుతమైన నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా.. క్వారంటైన్ సందర్భంగా అతిధి మరోసారి తన సింగింగ్ టాలెంట్ ని బయట పెట్టింది. 'అభి నా జో చోడ్ కె' అనే పాటని అతిథి అతి మధురంగా పాడింది. దీనికి ఆసక్తికర క్యాప్షన్ పెట్టింది. 

సైకో కరోనాపై రివర్స్ సైకాలజీ అప్లై చేస్తున్నా.. గో  కరోనా గో అని అతిధి ఇంస్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. కరోనా సంగతేమో కానీ.. అతిధి పాట మాత్రం నెటిజన్లని ఆకట్టుకుంటోంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Trying reverse psychology on a psycho virus 🤷🏻‍♀️ #GoCoronaGo 🙄 #QuarantineDiaries #StayHome

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) on Apr 16, 2020 at 6:52am PDT