ఏపీ సీఎం వైఎస్ జగన్ ను సినీ నటుడు చిరంజీవి సోమవారం నాడు మీట్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం అటు టాలీవుడ్ లోనూ ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ మీటింగ్ గురించి అందరూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. చిరుని తన ఇంటికి ఆహ్వానించిన జగన్ అతడితో కలిసి లంచ్ కూడా చేశారు. వీరిద్దరూ ఏం మాట్లాడుకొని ఉంటారా..? అనే ఆసక్తి నెలకొంది.

అయితే కేవలం సినిమా గురించే మాట్లాడుకున్నామని, రాజకీయాల చర్చ రాలేదని చిరు చెప్పారు. ఇది ఇలా ఉండగా.. వీరి మీటింగ్ పై చాలా మంది తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ వంటి ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు వెరైటీ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా నటి శ్రీరెడ్డి కూడా ఈ విషయంపై స్పందించింది. వైఎస్సార్ సీపీకి మద్దతు పలికే శ్రీరెడ్డి మరోసారి ఈ పార్టీపై ప్రేమ కురిపించింది.

చిరంజీవి ప్రత్యేకంగా జగన్ ని కలవడానికి వెళ్లడంతో అతడిని పొగుడుతూ ఓ పోస్ట్ పెట్టింది. 'చిరు సూపర్.. వైఎస్సార్ సీపీ మేమందరం మీకు ఫుల్ సపోర్ట్' అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది. ఇక చిరంజీవి.. జగన్ ని కలవడం పవన్ తట్టుకోలేకపోతున్నాడంటూ కొన్ని మీమ్స్ ని షేర్ చేసింది.

కాస్టింగ్ కౌచ్ లో పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన శ్రీరెడ్డి ఇప్పటికీ అదే బాటలో సందర్భం వచ్చిన ప్రతీసారి ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూనే ఉంది. అప్పుడప్పుడు రాజకీయాల గురించి కూడా మాట్లాడుతూ పాలిటిక్స్ లోకి వెళ్లే ఆసక్తి ఉందన్నట్లు ప్రవర్తిస్తోంది.