వివాదాస్పద నటి శ్రీరెడ్డి అఘోరీగా మారి రచ్చ చేసిన సంగతి తెలిసిందే. నిన్న శివరాత్రి సందర్భంగా ఆమె మెడలో భారీగా రుద్రాక్ష మాలలు ధరించి, ఒళ్లంతా బూడిద పూసుకొని, ఒక చేతిలో ఢమరుకం, మరో చేతిలో కర్ర పట్టుకొని నాట్యం చేసింది.

అఘోరా వేషాలతో ఉన్న మరో ఇద్దరితో కలిసి డాన్స్ చేస్తూ టిక్ టాక్ వీడియో చేసింది. టిక్ టాక్ లో ఫాలోవర్ల సంఖ్య పెంచుకోవడం కోసం శ్రీరెడ్డి ఇలా వీడియో చేసింది. శ్రీరెడ్డిని ఈ అవతారంలో చూసిన నెటిజన్లు షాక్ అవ్వడంతో పాటు ఆమెని తిట్టిపోస్తున్నారు.

బూతులు మొదలు పెట్టింది, మాట్లాడడం మానేశా.. శ్రీరెడ్డిపై మరో కేసు

ఎంతో పవిత్రమైన శివరాత్రి రోజు ఇలా వెకిలి చేష్టలతో వీడియోలు చేస్తూ దేవుడినే అవమానిస్తోందంటూ మండిపడుతున్నారు. శ్రీరెడ్డి అవతారంలో భక్తి కనిపించడం లేదని.. కావాలనే ఇలాంటి వివాదాలకు తెర తీస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.. వివాదాలకు దూరంగా ఉంటున్నాను అంటూనే కొన్ని ఇంటర్వ్యూలలో రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణిలపై శ్రీరెడ్డి మండిపడింది. తనకు నచ్చినట్లు బూతులతో విరుచుకుపడింది. దీంతో కరాటే కళ్యాణి పోలీసుల దగ్గరకి వెళ్లి శ్రీరెడ్డిపై కంప్లైంట్ ఇచ్చింది. మరి ఈ వివాదం ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి!