నటి శ్రీరెడ్డి మీటూ ఉద్యమం మొదలుపెట్టిన సమయంలో హీరో నానిపై పరోక్షంగా చాలా కామెంట్స్ చేసింది. అతడి ఇమేజ్ కి డ్యామేజ్ కలిగించేలా ఆమె చేసిన వ్యాఖ్యలు నాని ఫ్యాన్స్ ని బాధపెట్టాయి. నాని కుటుంబసభ్యులు కూడా ఈ విషయంలో హర్ట్ అవ్వడంతో నాని నేరుగా రంగంలోకి దిగి శ్రీరెడ్డి ఆరోపణలను ఖండించాడు.

అంతేకాదు.. శ్రీరెడ్డికి లీగలు నోటీసులు కూడా పంపించాడు. ఈ విషయంలో శ్రీరెడ్డి కూడా న్యాయపరంగా పోరాడుదామని చెప్పింది. అయితే కొన్నాళ్లకు ఈ విషయాలు సద్దుమణిగాయనుకుంటే.. శ్రీరెడ్డి మాత్రం సోషల్ మీడియాలో అప్పుడప్పుడు నానిపై పోస్ట్ లు పెడుతూ అతడిని కెలుకుతూనే ఉంది.

సీరత్ కపూర్ స్కిన్ షో (వైరల్ ఫొటోస్)

తాజాగా నాని నిర్మించిన 'హిట్' సినిమాని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. విశ్వక్ సేన్, రుహాని శర్మ జంటగా నటించిన 'హిట్' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో 'హిట్టా ఫట్టా.. నూనిగాడు ఓం బూమ్ ఫట్ అంటగా' అని సెటైర్ వేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమె నానిపైనే కామెంట్స్ చేసిందనే క్లారిటీకి వచ్చారు. ఇకపోతే 'హిట్' సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు సినిమా బాగుందని చెబుతుంటే మరికొందరు మాత్రం ఏవరేజ్ అని కామెంట్స్ పెడుతున్నారు.