అడవి శేష్ హీరోగా తెరకెక్కిన గూడఛారి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ శోభితా దూళిపాల. 2013 ఫెమినా మిస్‌ ఇండియా కాంపిటీషన్‌లో రన్నరప్‌గా నిలిచిన శోభిత తరువాత వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. పలు బ్రాండ్‌లకు ప్రమోటర్‌గా ఉన్న ఈ భామ, మ్యాగజైన్‌ కవర్ ఫేజ్‌ల మీద తరుచూ సందడి చేస్తుంటుంది. అయితే తాజగా ఈ భామ చేసిన ఓ ఫోటో షూట్ వివాదాస్పదమైంది. అందుకు కారణం లేకపోలేదు. లాక్ డౌన్‌ సమయంలో ఫోటో షూట్ చేయటమే వివాదానికి కారణం.

ఇటీవల శోభిత ఓ మేగజైన్‌ కోసం ఫోటో షూట్ చేసింది. దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్న సమయంలోనే ఈ ఫోటో షూట్ చేసింది శోభిత. అయితే తాను స్వయంగా మేకప్‌ వేసుకొని కెమెరాలో సెల్ఫ్‌ టైమర్‌ ఆప్షన్‌ ద్వారా ఈ ఫోటో షూట్ చేశానని ఎవరు ఈ ఫోటోషూట్‌లో పాల్గొనలేదని చెప్పింది శోభిత. కానీ ఇటీవల ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు రావటంతో వివాదాం మొదలైంది. ఆ ఫోటోలో శోభితను మరో వ్యక్తి ఫోటోలు తీస్తున్నట్టుగా స్పష్టంగా ఉంది.

దీంతో లాక్‌ డౌన్‌ సమయంలో ఇలా ఫోటో షూట్‌ లు ఏంటి అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. దీంతో హర్ట్ అయిన శోభిత అసలు విషయం వివరించే ప్రయత్నం చేసింది. తాను స్వయంగా ఫోటో షూట్ తీసుకునే ఉద్దేశతో కాఫీ కప్‌తో పాటు తన ఫోన్‌ తీసుకొని  ఇంటి టెర్రస్‌ మీదకు వెళ్లిందట. అయితే అప్పటికే అక్కడ కొంత మంది వ్యక్తులు ఉన్నారట. ఈ సమయంలో శోభిత ఫోటోలు తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో ఆ వ్యక్తి కొన్ని ఫోటోలు తీసేందుకు సాయం చేశాడట.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sobhita Dhulipala (@sobhitad) on Apr 24, 2020 at 9:42am PDT