మలయాళీ చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించే సరితా నాయర్ పలు వివాదాల్లో చిక్కుకుంది. తమిళనాడులోని వడవల్లి అనే నగరంలో సరితా సోలార్ ప్యానల్ బిజినెస్ ప్రారంభించింది. ఆ సమయంలో సరితా దాదాపు 30 మంది ప్రజల వద్ద దాదాపు రూ 6 కోట్లు వసూలు చేసింది. 

వారికి విండ్ మిల్స్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చింది. కానీ సరితా వారందరిని మోసం చేసి డబ్బు వసూలు చేసుకుంది. ఆమెకు డబ్బు ఇచ్చిన కస్టమర్లు ఎంత ఎదురుచూసిన ఫలితం లేకవడంతో సరితపై చీటింగ్ కేసు నమోదు చేశారు. 

సరితాతో పాటు ఆమె మాజీ భర్త రాధాకృష్ణన్, మేనేజర్ రవి పై కూడా కేసులు నమోదయ్యాయి. తాజాగా కోయంబత్తూర్ కోర్టు ఈ కేసుపై తీర్పు ఇస్తూ సరితకు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. రూ.10 వేల జరిమానా కూడా విధించింది. 

సరిత రాజకీయంగా కూడా వివాదాల్లో నిలిచింది. 2017లో అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీపై ఆరోపణలు చేసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీపై వయనాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి డిపాజిట్లు కూడా కోల్పోయింది.