సోషల్ మీడియాలో మా హీరో గొప్ప అంటే,. మా హీరో గొప్ప అంటూ అభిమానులు ఫ్యాన్ వార్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రతి రోజూ హీరోల అభిమానులు ఈ విషయంలో గొడవలు పడుతూనే ఉంటారు. తాజాగా.. హీరోయిన్ల ఫ్యాన్ వార్ జరుగుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత అభిమానులు ఇప్పుడు.. మరో టాప్ హీరోయిన్ పూజా హెగ్డేపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల పూజా సోషల్ మీడియా ఖాతాలో సమంతను కించ పరిచేలా కామెంట్స్ పెట్టారు. పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో సమంతపై చేసిన కామెంట్. ‘సమంత అందంగా ఉంటుందని నేను అనుకోవడం లేదు’ అని పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ఇది చూసిన సమంత అభిమానులు ఆ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్‌లో ఏకేయడం మొదలుపెట్టారు.

అయితే.. తన ఇన్ స్టాగ్రామ్ ని ఎవరో హ్యాక్ చేశారని.. అందుకే అలాంటి పోస్టులు వచ్చాయని పూజా వివరణ ఇచ్చింది.  తన ఎకౌంట్ నుంచి వచ్చిన ఇన్విటేషన్స్ ను ఎవరూ పట్టించుకోవద్దని రిక్వెస్ట్ చేసింది. ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ అకౌంటుతో షేర్‌ చేసుకోవద్దని తెలిపింది. తన అకౌంటును ఎవరో హ్యాక్ చేశారని తన డిజిటల్‌ టీమ్‌ తనకు తెలిపిందని ఆమె ట్విట్టర్‌ ఖాతాలో అభిమానులకు చెప్పింది.

ఎట్టకేలకు తన అకౌంట్‌ తన చేతుల్లోకి తిరిగి వచ్చినట్లు మరో ట్వీట్ చేసింది పూజా. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ఆమె డిజిటల్ టీమ్‌ సరి చేసిందని తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ పూజా హెగ్డే మరో ట్వీట్ చేసింది. తన డిజిట్‌ టీమ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఎట్టకేలకు తన అకౌంట్‌ తన చేతుల్లోకి తిరిగి వచ్చినట్లు పేర్కొంది. ఇన్‌స్టాలో హ్యాక్ అయిన సమయంలో హ్యాకర్లు చేసిన పోస్ట్‌లను తొలగించానని తెలిపింది పూజా.

కానీ సమంత అభిమానులు మాత్రం దానిని వదిలేలా లేరు. #PoojaMustApologizeSamantha అనే హ్యాష్ ట్యాగ్‌తో పూజా హెగ్డేకు వ్యతిరేకంగా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ఇండియాలో టాప్ ట్విట్టర్ ట్రెండ్ ఇదే కావడం గమనార్హం.

పూజా ఎకౌంట్ హ్యాకింగ్ కి గురైన మాట నిజమే కావచ్చు. కానీ..  ఇక్కడ సమంతను కించ పరిచారు కదా అనేది సామ్ అభిమానుల వాదన. ఇక్కడ అవమానపడింది సమంత కాబట్టి.. వెంటనే పూజా హెగ్డే.. సమంతకు క్షమాపణలు చెప్పాల్సిందిగా సమంత అభిమానులు సోషల్ మీడియాలో ట్యాగ్స్ చేస్తున్నారు. 

ఇంకొందరేమో.. కావాలనే పూజ ఇలాంటి పోస్టులు పెట్టిందంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం గమనార్హం.  మరి పూజ.. సమంతకు సారీ చెబుతుందో లేదో చూడాలి.