పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత సినిమాలకు దూరమయ్యారు. ఇక ఆయన నుండి సినిమాలు రావేమో అనుకుంటున్న తరుణంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. ముందుగా 'పింక్' రీమేక్ తో పవన్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

బాలీవుడ్ లో సక్సెస్ అయిన 'పింక్'ని తెలుగులో దిల్ రాజు, బోనీకపూర్ కలిసి నిర్మిస్తున్నారు. వేణుశ్రీరామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఫోటోలు, డైలాగ్స్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాలో పవన్ సరసన రేణుదేశాయ్ కనిపించనుందని వార్తలు వచ్చాయి.

అది ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యం : పవన్ కల్యాణ్

పవన్ రీఎంట్రీ సినిమాలో అతడి మాజీ భార్య నటిస్తుందనే రూమర్ రాగానే అది బాగా వైరల్ అయింది. ఇదే విషయంపై ఓ నెటిజన్.. రేణుదేశాయ్ ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు. 'మీరు పింక్ రీమేక్ లో నటిస్తున్నారా..?' అని ప్రశ్నించగా.. దానికి రేణు.. లేదని, అవన్నీ అసత్య కథనాలు అంటూ తేల్చి చెప్పింది.

ఈ మధ్యకాలంలో మీడియాలో రేణుకి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమె హైదరాబాద్ కి షిఫ్ట్ అయిందని.. తను, పిల్లలు విలాసవంతంగా జీవించడానికి పవన్ ఓ ఫ్లాట్ ని కొనిచ్చాడని వార్తలు వచ్చాయి.

దీనిపై స్పందించిన రేణు.. అందులో ఎంతమాత్రం నిజం లేదని.. తను కష్టపడి సంపాదించిన డబ్బుతో అపార్ట్మెంట్ కొనుక్కున్నానని చెప్పింది. తన మాజీ భర్త నుండి అన్యాయపూరితమైన భరణం తీసుకోలేదని వెల్లడించింది.