సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలపై ట్రోలింగ్ బాగా ఎక్కువైంది. వారికి వ్యక్తిగత స్వేచ్చ అనేది లేకుండా పోయింది. కొందరు నెటిజన్లు సెలబ్రిటీల మీద ఇష్టానుసారం కామెంట్స్ చేస్తుంటారు. ఈ కామెంట్స్ ని చాలా మంది సెలబ్రిటీలు పట్టించుకోరు.

కానీ ఒక్కోసారి అసహనానికి లోనైతే గనుక నెటిజన్లకు క్లాస్ లు పీకుతుంటారు. తాజాగా హీరోయిన్ రష్మిక నెటిజన్లపై మండిపడింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల రష్మిక తన చిన్ననాటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది చూసిన ఆమె అభిమానులు క్యూట్ గా ఉన్నావని కామెంట్స్ చేశారు. 

Bigg Boss 3: షోపై జాఫర్ సంచలన కామెంట్స్.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

కానీ ఓ నెటిజన్ మాత్రం రష్మికని వేశ్య అనే అర్ధం వచ్చేలా కన్నడలో కామెంట్ పెట్టాడు. హద్దులు దాటిన సదరు నెటిజన్ ప్రవర్తన కారణంగా బాధ పడిన రష్మిక అతడిపై మండిపడింది. సెలబ్రిటీలను ఎలా పడితే అలా మాటలు అంటున్నారంటూ ఫైర్ అయింది.

సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ద్వారా నెటిజన్లకు ఏమొస్తుందో తెలియడం లేదని అంది. సెలబ్రిటీలను ఎంత మాట పడితే అంత మాట అనడం, మా గురించి ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పింది.  నెటిజన్లలో చాలామంది 'అసభ్యకరమైన ట్రోల్స్ ని పట్టించుకోవద్దని' చెబుతుంటారని.. చాలా సార్లు అదే పని చేస్తానని.. కానీ  వ్యక్తిగత కామెంట్లు చేస్తే స్పందించకుండా ఎలా ఉంటామని ప్రశ్నించింది.

'మీరు మా పని గురించి ట్రోల్ చేయండి.. కానీ మా వ్యక్తిగత విషయాలు, కుటుంబం గురించి ట్రోల్ చేసే హక్కు మీకు లేదు' అంటూ ఫైర్ అయింది. నటీనటులు కావడం అంత సులభమైన విషయం కాదని ప్రతీ వృత్తిలో గౌరవం ఉంటుందని చెప్పింది.