టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సీనియర్ నటి ప్రగతి దూసుకుపోతోంది. ప్రస్తుతం ప్రగతి టాలీవుడ్ లో తల్లి పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. తల్లి పాత్రల్లో సెంటిమెంట్ పండించడం మాత్రమే కాదు.. ప్రగతికి మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంది. 

ఎఫ్ 2 చిత్రంలో ప్రగతి తమన్నా తల్లిగా ఎలాంటి హాస్యం పండించిందో అంతా చూశారు. దీనితో ప్రగతికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇక ప్రగతి గ్లామర్ గా కనిపించేందుకు కూడా ఇష్టపడుతుంది. ఇటీవల ప్రగతి టాటూ పిక్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

తాజాగా ప్రగతి  మరోమారు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పంచె కట్టి తీన్మార్ డాన్స్ చేస్తున్న వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ప్రగతి పూనకం వచ్చినట్లు రెచ్చిపోయింది. దుమ్ము దులిపే స్టెప్పులతో ఫ్లోర్ ని అదరగొట్టేసింది. 

ప్రగతి చివరగా ఓ బేబీ, ఎఫ్2, అర్జున్ సురవరం లాంటి చిత్రాల్లో నటించింది. ప్రగతి తీన్మార్ డాన్స్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.