బాలీవుడ్ సీనియర్ నటి నఫీసా అలీ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. నసీఫా అలీ మేనకోడలు దియా నాయుడు కొన్ని రోజుల క్రితం కరోనా బారీన పడ్డారు.

బాలీవుడ్ సీనియర్ నటి నఫీసా అలీ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. నసీఫా అలీ మేనకోడలు దియా నాయుడు కొన్ని రోజుల క్రితం కరోనా బారీన పడ్డారు. ఆమె కోలుకుని ప్రస్తుతం డిశ్చార్జి అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న వారి బ్లడ్ ప్లాస్మాని కరోనా పేషంట్స్ చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

View post on Instagram

దీనితో కరోనా నుంచి కోలుకున్న వారు తమ బ్లడ్ ప్లాస్మా దానం చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న ఓ వైద్యుడు తన బ్లడ్ ప్లాస్మా ని డొనేట్ చేశాడు. కర్ణాటకలో బ్లడ్ ప్లాస్మా ని డొనేట్ చేసిన రెండవ పేషంట్ గా దియా నాయుడు నిలిచింది. 

ఈ విషయాన్ని నఫీసా అలీ తన సోషల్ మీడియాలో తెలియజేశారు. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న వారి బ్లడ్ ప్లాస్మా ద్రవరూపంలో ఉన్న బంగారంతో సామానం అని అన్నారు. అలాంటి బ్లడ్ ప్లాస్మాని తన మేనకోడలు డొనేట్ చేసిందని.. ఆమె అనుభవాలని మీరంతా తెలుసుకోవాలని కోరారు. 

View post on Instagram

కరోనా నుంచి కోలుకున్న వారి రక్తంలో బలమైన కణాలు ఉంటాయని, అవి క్రిటికల్ గా ఉన్న కరోనా పేషంట్స్ కు ఉపయోగపడుతాయని అన్నారు. బ్లడ్ ప్లాస్మా డొనేట్ చేయడంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. రెండు వరాల పాటు సరిగా విశ్రాంతి తీసుకుంటే.. తిరిగి మరోసారి డొనేట్ చేయొచ్చని తనకు వైద్యులు చెప్పినట్లు దియా నాయుడు పేర్కొన్నారు. 

View post on Instagram