గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై సినీనటి ముమైత్ ఖాన్ స్పందించారు. క్యాబ్ డ్రైవర్ రాజు ఆరోపణలను ఆమె ఖండించారు. గోవా ట్రిప్‌లో తాను పూర్తిగా డబ్బులు చెల్లించనని ముమైత్ ఖాన్ వెల్లడించారు.

డ్రైవర్ రాజు నుంచి తనకు ప్రాణహానీ ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. డ్రైవర్ రాజు తనను తీవ్ర వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. అతను చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని చెప్పింది ముమైత్.

ర్యాష్ డ్రైవింగ్ చేసి భయాందోళనలకు గురిచేశాడని చెప్పుకొచ్చింది ముమైత్. డబ్బులు చెల్లించకుండా మోసం చేశాననడం కరెక్ట్ కాదంది ముమైత్ ఖాన్. రాజుపై పంజాగుట్టు పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది.

12 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నానని... తన క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసునని ముమైత్ వెల్లడించింది. ఫ్లైట్‌లో పెట్స్‌కు అనుమతి లేకపోవడంతో క్యాబ్‌లో గోవాకు వెళ్లానని పేర్కొంది.