బెంగళూరు: కరోనా వైరస్ దేశంలో విజృంభన కొనసాగిస్తోంది. కరోనా బారిన పడి పలువురు మృత్యువాత పడ్డారు. తాజాగా నటి మాలాశ్రీ భర్త, సినీ నిర్మాత కుణిగల్ రామ్ (52) కరోనాతో మరణించారు. వారం రోజుల క్రితం ఆయన కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 

దాంతో ఆయన కర్ణాటక రాజధాని బెంగళూరులోని మత్తికెరెలో గల ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలి చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 

తుమకూరు జిల్లా కుణిగల్ కు చెందిన రాము కన్నడ సినీ పరిశ్రమలో నిర్మాతగా కొనసాగుతున్నారు. గోలీబార్ సినిమా ద్వారా ఆయన నిర్మాతగా సినీ పరిశ్రమలో ప్రవేశించారు. శాండల్ వుడ్ కోట్లాది రూపాయలతో సినిమా తీసిన నిర్మాతగా కోటి రాముగా ప్రసిద్ధి పొందారు.

ఏకె 47, లాకప్ డెత్, కలాసిపాళ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు కన్న సినిమ రంగంలో హీరోయిన్ గా రాణిస్తున్న మాలాశ్రీని వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. రాము మరణవార్త విని సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. 

మాలాశ్రీ కన్నడంలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా నటించారు. లేడీ ఓరియెంటెడ్ పాత్రలు వేసి ప్రత్యేక గుర్తింపును పొందారు.