సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలకు వేధింపులు కూడా బాగా ఎక్కువయ్యాయి. మన తారలకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ లో నీచమైన కామెంట్స్ పెడుతూ వారిని ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా యాంకర్ అనసూయపై దారుణమైన పోస్ట్ లు పెట్టడంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

ఈ విషయం హాట్ టాపిక్ గా మారడంతో నటి, బీజేపీ యువ నాయకురాలు మాధవీలతా వల్గర్ పోస్ట్ లపై మండిపడింది. సెలబ్రిటీలను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదంటూ ఆమె కొన్ని మీడియా ఛానెల్స్ డిస్కషన్స్ లో పాల్గొని తన వాదన వినిపించింది.

అనుష్క, అనసూయలపై డీగ్రేడ్ కామెంట్స్.. ట్వీట్ వైరల్

దీనిపై స్పందించిన ఓ నెటిజన్.. 'ఎవరైనా బీజేపీ వాళ్లు దీన్ని రేప్ చేసి చంపేస్తే.. దరిద్రం వదిలిపోతుంది' అంటూ కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్ చూసిన మాధవీలతా అంతే ఘాటుగా స్పందించింది. సదరు నెటిజన్ పెట్టిన కామెంట్స్ ని స్క్రీన్ షాట్ తీసి మరీ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

''ఇలాంటి లుచ్చా లంగా కొడుకుల్ని ఏం చేయాలి.. కోసి పారేయాలిగా. ఏం చూసుకుని మగాడని ఫీల్ అవుతున్నాడో.. వీడి బ్రెయిన్‌లో ఎంత నీఛంగా ఉందో.. ఏమనాలి ఇలాంటి పుండాకోర్ గాల్లని..?'' అంటూ మండిపడింది.

ఈ విషయంలో చాలా మంది నెటిజన్లు మాధవీలతాకి మద్దతుగా నిలిచారు. గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో మాధవీలతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలతో పాటు సోషల్ ఇష్యూలపై కూడా స్పందిస్తూ ఉంటుంది.