సీనియర్ నటి కౌసల్య పరిమిత సంఖ్యలో తెలుగు సినిమాల్లో నటించారు. ఇటీవల కౌసల్య ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. కౌసల్య దక్షణాది భాషలన్నింటిలో నటించారు. టివి సీరియల్స్ లో కూడా కౌసల్య నటించారు. 

ఇటీవల కౌసల్య తెలుగులో రారండోయ్ వేడుక చూద్దాం, సవ్యసాచి లాంటి చిత్రాల్లో కనిపించారు. సవ్యసాచి చిత్రంలో కౌసల్య నాగ చైతన్యకు తల్లిగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె హైదరాబాద్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. 

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు అమీర్ పేటలోని సారథి స్టూడియోలో కౌసల్య మొక్కలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కౌసల్య గారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటే అవకాశం నాకు లభించడం సంతోషకరమని అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దేశాన్ని పచ్చదనంగా మారుస్తుంది అన్నారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో సినిమా నటుడు కాదంబరి కిరణ్; గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొ ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు..