హైదరాబాద్ నగరంలో కరోన వైరస్ కేసు బయటపడడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. బయటి ప్రదేశాల నుండి ఎవరు వచ్చినా వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాతే పంపిస్తున్నారు.

ఈ నేపధ్యంలో ప్రముఖ సీనియర్ నటి కస్తూరి కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ కి వచ్చారట. అయితే ఇక్కడ నుండి ఆమె తిరిగి తన స్వస్థలమైన చెన్నై వెళ్లిపోవాల్సి వుంది. కానీ కరోనా కేసులు తెలంగాణాలో ఎక్కువ అవుతుండడంతో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లడానికి భయపడుతున్నారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. 'తెలంగాణాలో కరోనా పేషంట్ ఉన్నారా..? నేను ఇక హైదరాబాద్ లో చిక్కుకుపోవాల్సిందేనా..? ఎందుకంటే నాకు ఎయిర్ పోర్ట్ కి వెళ్లాలంటే భయంగా ఉంది' అంటూ ట్వీట్ చేశారు.

హైదరాబాద్ లో కరోనా వైరస్ కేసు గుర్తించిన నేపధ్యంలో తాజాగా మంగళవారం నాడు మరో ముగ్గురు వ్యాధి లక్షణాలతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. వైద్య సిబ్బంది వీరిని ఐసోలేషన్ వార్డ్ కి తరలించి రక్తపరీక్షలు నిర్వహించనున్నారు. రిజల్ట్స్ వచ్చే వరకు ఏమీ చెప్పలేమని డాక్టర్లు చెప్పారు.