Asianet News TeluguAsianet News Telugu

హేమ అరెస్టు.. 10 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

 నాలుగో అదనపు సివిల్‌, జేఎంఎఫ్‌సీ కోర్టు జడ్జి ముందు పరిచగా.. జూన్‌ 14వరకు ఆమెకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. 

Actress Hema sent to 14 days judicial custody jsp
Author
First Published Jun 4, 2024, 7:49 AM IST


గత నెలలో బెంగళూరులోని ఓ ఫామ్‌హౌస్‌లో పార్టీ నేపథ్యంలో నమోదైన కేసులో హేమను విచారణ చేసారు. రెండు సార్లు నోటీసులు ఇవ్వగా.. విచారణకు హేమ హాజరుకాలేదు. తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చి.. విచారణ అనంతరం ఆమెను అరెస్టు చేశారు. అనంతరం ఆమెను అనేకల్‌లోని నాలుగో అదనపు సివిల్‌, జేఎంఎఫ్‌సీ కోర్టు జడ్జి ముందు పరిచగా.. జూన్‌ 14వరకు ఆమెకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. 

కేసు వివరాల్లోకి వెళితే...

బెంగళూరు సిటీ అవుట్ స్కర్ట్స్ లో  నిర్వహించిన రేవ్‌ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడిన విషయం తెలిసిందే.  అదే పార్టీలో అనేక రకాల డ్రగ్స్‌ వాడినట్లు పోలీసులు గుర్తించారు. 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు వెల్లడించారు. 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి వైద్య పరీక్షలో డ్రగ్‌ పాజిటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు. 

రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులతో పాటు సినీ నటి హేమ కూడా విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే, తనకు వైరల్‌ ఫీవర్‌ వచ్చిందని, విచారణకు హాజరుకాలేనని హేమ (Hema) బెంగళూరు పోలీసులకు లేఖ రాశారు. విచారణకు హాజరుకావడానికి ఇంకాస్త సమయం కావాలని కోరారు. అయితే, హేమ అభ్యర్థనను సీసీబీ పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు. విచారణకు గైర్హాజరైన హేమకు కొత్తగా నోటీసులు పంపారు. తాజాగా ఆమెను అరెస్ట్‌ చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios