తన సినిమాల్లో లిప్ లాక్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాల గురించి ముందే తన తల్లితో డిస్కస్ చేస్తానని చెబుతోంది నటి పాయల్ రాజ్ పుత్. సాధారణంగా తమ పిల్లలను తెరపై బోల్డ్ గా చూడడానికి తల్లితండ్రులు ఇబ్బంది పడుతుంటారు. కానీ పాయల్ మాత్రం ఇంటిమేట్ సీన్ల గురించి తన తల్లితో మాట్లాడడానికి అసలు మొహమాటపడదట.

ఇలాంటి వాటికి తన తల్లి ఇబ్బంది పడరని కాదని.. కానీ తన తల్లి దగ్గర నిజాయితీగా ఉండాలనే ఉద్దేశంతో తాను ఎలాంటి సినిమా చేస్తున్నానో.. అందులో సన్నివేశాలు ఎలా ఉంటాయో ఓపెన్ గా చెప్పడం తనకు అలవాటని చెప్పింది పాయల్.  సినిమాలకు సంబంధించి ప్రతీది తన తల్లితో పంచుకోవడం అలవాటు అని చెప్పుకొచ్చింది పాయల్.

ఇప్పటికీ తను ఏదైనా స్క్రిప్ట్ వింటే అందులో విషయాలన్నీ అమ్మతో పంచుకుంటూ.. ఇన్ని ముద్దు సీన్లు ఉన్నాయి.. ఇలాంటి రొమాంటిక్ సీన్లు ఉంటాయని చెబుతుంటానని పాయల్ తెలిపారు. నీ మనసుకి నచ్చి సౌకర్యంగా అనిపిస్తే ఏదైనా చేయమని తన తల్లి సలహా ఇస్తుందని.. అయితే బోల్డ్ గా ఉండే పాత్రలు ఎంత కష్టపడి చేసినా.. తల్లితండ్రులతో కలిసి చూడడం అసౌకర్యంగానే ఉంటుందని చెప్పుకొచ్చింది.

వాళ్లకి కూడా తనను తెరపై అలా చూడడం ఇబ్బందిగానే అనిపించొచ్చు కానీ ఎప్పుడూ బయటకి చెప్పరని వెల్లడించింది. ప్రస్తుతం పాయల్ నటించిన 'ఆర్డీఎక్స్' సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాని తన తల్లితండ్రులతో కలిసి చూడాలనుకుంటుంది పాయల్.