ఇటీవల సోషల్ మీడియాలో సెలెబ్రిటీలపై నెటిజన్లు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ఎక్కువవుతోంది. ఈ ధోరణి ఎక్కువయ్యే కొద్దీ నటీమణులు కూడా ఘాటుగా బదులిస్తున్నారు. అసభ్యకరమైన వ్యాఖ్యలు కట్టిపెట్టాలని కోరుతున్నారు. 

తాజాగా హీరోయిన్ చాందిని చౌదరికి ఇలాంటి సంఘటనే ఎదురైంది. హౌరా బ్రిడ్జ్, కేటుగాడు లాంటి చిత్రాల్లో చాందిని చౌదరి నటించింది. ఓ ఆన్లైన్ పోర్టల్ చాందిని చౌదరిని బి గ్రేడ్ నటి అని అభివర్ణిస్తూ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలు చాందిని చౌదరిని మనస్తాపానికి గురిచేశాయి. 

వెంటనే ట్విట్టర్ వేదికగా చాందిని ఘాటుగా బదులిచ్చింది. మీడియా, ఫిలిం జర్నలిజం రోజు రోజుకు దిగజారిపోతుండడానికి ఇది ఒక ఉదాహరణ. కనీసం మీకు బి గ్రేడ్ అంటే అర్థం తెలుసా.. మీలాంటి వాళ్ళ వల్లే మహిళలు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు. సిగ్గులేని చర్య అంటూ చాందిని ఘాటుగా బదులిచ్చింది. 

సదరు ఆన్లైన్ పోర్టల్ చాందిని, హేబా పటేల్, నందిత శ్వేతా లాంటి బి గ్రేడ్ నటులంతా అవకాశాల కోసం వెబ్ సిరీస్ ల వైపు ఆసక్తి చూపుతున్నారంటూ ఓ కథనాన్ని ప్రచురించింది.