గుండెపోటుతో ప్రముఖ నటి కన్నుమూత.. షాక్‌లో ఇండస్ట్రీ

ప్రముఖ సినీ నటి, స్టేజ్‌ ఆర్టిస్ట్‌ ఉషా గంగూలి గుండెపోటుతో కన్నుమూశారు. దక్షిణ కోల్‌కతాలోని లేక్ గార్డేన్స్ ఏరియాలోని తన ఫ్లాట్‌లో ఆమె తుది శ్వాస విడిచారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఆమెను వెంటనే దగ్గర్లోని ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించినా ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు.

Actress and Stage Artiste Usha Ganguly dies at 75 in Kolkata

కరోన కష్టకాలంలో మరో విషాదం బాలీవుడ్‌ ఇండస్ట్రీని కమ్మేసింది.  ప్రముఖ సినీ నటి, స్టేజ్‌ ఆర్టిస్ట్‌ ఉషా గంగూలి గుండెపోటుతో కన్నుమూశారు. దక్షిణ కోల్‌కతాలోని లేక్ గార్డేన్స్ ఏరియాలోని తన ఫ్లాట్‌లో ఆమె తుది శ్వాస విడిచారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఆమెను వెంటనే దగ్గర్లోని ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించినా ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. కళారంగానికి విశేష సేవలందించిన ఉషా మృతికి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, లెజెండరీ నటులు షబానా ఆజ్మీ, అపర్ణాసేన్ సంతాపం తెలిపారు.

ఉషా గంగూలి జోధ్‌పూర్‌లో జన్మించారు. చిన్నతనంలోనే కళా రంగం పట్ల ఆకర్షితురాలైన ఆమె భరతనాట్యం నేర్చుకున్నారు. తరువాత హిందీ లిటరేచర్‌ నేర్చుకోవడానికి కోల్‌కతాకు వెళ్లారు. 1976లో రంగ కర్మీ సంస్థ ద్వారా నాటక రంగంలోకి అడుగుపెట్టారు. ఎన్నో సూపర్‌ హిట్ నాటకాల్లో కీలక పాత్రల్లో నటించిన ఆమె నటిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు.

నాటక రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు ఆమె కారణమయ్యారు. స్వయంగా ఆమె నిర్మాతగా మారి పలు నాటక ప్రదర్శలు ఇచ్చారు. సినీ రంగంలోనూ కేవలం నటిగానే కాక వివిథ రంగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. అజయ్‌ దేవగన్‌ హీరోగా తెరకెక్కిన రెయిన్‌ కోట్ అనే సినిమాకు ఆమె కథా సహకారం అంధించారు. పలు నాటకాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆమె దర్శకత్వంలో రూపొందిన గుడియా ఘర్ అనే నాటకానికి పశ్చిమ బెంగాళ్ ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ అవార్డుతో గౌరవించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios