Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి వార్తలను ఖండించిన మాధవీలత, ఆమెకు ఇష్టమైనవారు ఎవరంటే....

సోషల్ మీడియాలో మాధవీలత పోస్ట్ పెట్టిన వెంటనే....  సోషల్ మీడియాలో ఇదిగో తోక అంటే అదిగో పులి అనే జనాలు,మాధవీలత పెళ్లి ఖాయమైపోయిందని వార్తలను పుట్టించారు. ఇంకొందరైతే ఏకంగా ఆమె బీజేపీలోని ఇక యువ నేతతో పీకల్లోతు ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని, అందుకే త్వరలో వివరాలు వెల్లడిస్తాను అని అనిందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. 

Actress And BJP Leader Madhavi Latha Clarifies About her Facebook post
Author
Hyderabad, First Published Jun 7, 2020, 9:11 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రముఖ నటి, బీజేపీ నేత మాధవి లత కొన్ని రోజుల కింద పెట్టిన ఒక పోస్ట్ బాగా వైరల్ గా మారింది. ఆ పోస్టులో ఆమె ‘‘ఎన్నో నెలల తర్వాత నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. కొత్త జీవితం ప్రారంభమైంది. అద్భుతాలు జరిగాయి. నేను ఎప్పుడూ అద్భుతాలను నమ్ముతుంటాను. చాలా సంతోషంగా ఉంది. వివరాలు త్వరలో వెల్లడిస్తాను..’’ అని అన్నారు. 

 

సోషల్ మీడియాలో మాధవీలత పోస్ట్ పెట్టిన వెంటనే....  సోషల్ మీడియాలో ఇదిగో తోక అంటే అదిగో పులి అనే జనాలు,మాధవీలత పెళ్లి ఖాయమైపోయిందని వార్తలను పుట్టించారు. ఇంకొందరైతే ఏకంగా ఆమె బీజేపీలోని ఇక యువ నేతతో పీకల్లోతు ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని, అందుకే త్వరలో వివరాలు వెల్లడిస్తాను అని అనిందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. 

 

సెలెబ్రిటీల విషయంలో చిన్న పుకారు బయటకొస్తేనే స్టోరీలు అల్లేసి మీడియా...ఈ విషయంలోనూ అదే పని చేసింది. అందునా హీరోయిన్ పెళ్లి విషయంలో గాసిప్. దీన్ని అన్ని మీడియా చానళ్ళు కూడా తెగ ప్రచారం చేసాయి. 

 

ఇక ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకున్న మాధవి లతా మరో పేస్ బుక్ పోస్టును పెట్టింది. అందులో తన పెళ్లి వార్తల్లో నిజం లేదని ఖండించడమే కాకుండా, తనకు ఎలాఅంటూ వ్యక్తి అంటే ఇష్టమో కూడా చెప్పింది. 

"న్యూస్ లో వస్తున్న శుభవార్తలకి సంతోషం

శుభం పలకడం కూడా మంచి శకునమే
అందరికి ఒక విన్నపము
నాకు దమ్ము దైర్యం రెండు ఎక్కువే
ప్రేమించిన పెళ్లి చేసుకున్న దైర్యం గ చెప్తాను
అలాగే అంత దమ్ము దైర్యం ఉన్న మగాడంటేనే ఇష్టపడతా కూడా అంతే కానీ ఇష్టాన్ని ప్రేమని దొంగలా దాచుకుని సమాజానికి భయపడే పిరికివాళ్ళంటే నాకు చిరాకు
మాధవి లతని ప్రేమిస్తున్న పెళ్లి చేసుకుంటా అని దమ్ముగా చెప్పే వాడితోనే స్నేహం కూడా గొప్పగా ఉంటుంది కనుక మీడియా మిత్రులకి
నా అభిమానులకి ఫాలోయర్స్ చెప్పేది
ఏమనగా
కాస్త ఆగండి తొందరపడకండి
ఏదైనా చెప్పే చేస్తాను
నేను పిరికిదాన్ని కాదు
ఆలా అని పిరికివాడిని నేను ఒప్పుకోను .... కనుక
ఇంకా అంత దమ్ము ,దైర్యం ,సాహసం ,సత్తా ,విలువ ,శక్తి ,బలం ,అధికారం ఉన్న మనిషి కనపడలేదు నాకు
ముసుగులో రిలేషన్స్ మైంటైన్ చేసే మనుషులన్నా కూడా నాకు అసహ్యమే
కనుక
ఏదైనా చెప్పి చేస్తాను.
మొన్నామధ్య చావు మేళం న్యూస్ వేశారు
అంత మన మంచికే అన్నట్లు ఇపుడు పెళ్లి మేళం వార్త వేశారు
ఏమో తధాస్తు దేవతలు తదాస్తు అంటే
మీడియా మిత్రులకి మంచి పెళ్లి భోజనం పెడతాము
ఇప్పటికి సెలవు

కొంపదీసి పెళ్లికళ వచ్చేసిందంటారా ????
మీ మీడియా వాళ్ళు నా పెళ్లి చేసిన చేసేస్తారు సుమీ

ప్రేమ తో మీ మాధవీలత" అని పేస్ బుక్ లో రాసుకొచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios