కోలీవుడ్ స్టార్  హీరో విజయ్ కి ఐటి అధికారులు షాకిచ్చారు. ప్రస్తుతం ఆదాయపన్ను శాఖ అధికారులు తమిళ సినిమా ఇండస్ట్రీలోని కొంత మంది ప్రముఖుల ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే రీసెంట్ గా ఐటి అధికారులు స్టార్ హీరో ఇళయథపతి విజయ్ ని కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది, షూటింగ్ లో ఉండగానే విజయ్ ని కలిసిన అధికారులు 5 గంటలపాటు విచారించారు.

ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చిత్ర నిర్మాణ సంస్థ AGS ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై కూడా అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. 2017లో వచ్చిన మెర్సల్ సినిమా సంస్థతో సంబంధం ఉన్న పన్ను ఎగవేత కేసుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆ సినిమాలో GST ని హేళన చేస్తూ డైలాగ్స్ ఉండటాన్ని అప్పట్లో బిజెపి నేతలు తీవ్రంగా ఖండించారు.

 పలు చోట్ల సినిమాను ప్రదర్శించకుండా అడ్డుకున్నారు. ప్రస్తుతం విజయ్ మాస్టర్ సినిమాలో నటిస్తున్నాడు. లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. షూటింగ్ జరుగుతుండగా సడన్ గా లొకేషన్ లోకి వచ్చిన ఐటి ఆఫీసర్స్ విజయ్ ని పిలిచి పర్సనల్ గా విచారణ జరిపారు.