Asianet News TeluguAsianet News Telugu

హీరో విజయ్ కి ఐటీ సమన్లు.. విచారణకి రాలేనని చెప్పేశాడు!

 కొన్ని రోజుల క్రితం హీరో విజయ్ మాస్టర్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉండగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

Actor Vijay, Producer get notices
Author
Hyderabad, First Published Feb 10, 2020, 10:50 AM IST

ఇళయదళపతి విజయ్ కేంద్రంగా తమిళనాడులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం హీరో విజయ్ మాస్టర్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉండగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

నేరుగా షూటింగ్ స్పాట్ లోనే అధికారులు విజయ్ ని ప్రశ్నించారు. అనంతరం అతడి నివాసంలో సోదాలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా హీరో విజయ్. బిగిల్ చిత్రంతో ఆర్థికంగా సంబంధం ఉన్న వ్యక్తులపై ఐటీ దాడులు జరుగుతూనే ఉన్నాయి.  

బ్యాగుల్లో కూడా పట్టనంత డబ్బు.. విజయ్, బిగిల్ ఫైనాన్సియర్ ఇంట్లో..

ఈ సోదాల్లో విజయ్ నివాసంతో పాటు, బిగిల్ ఫైనాన్షియర్ అన్బు చెలియన్ నివాసంలో దాదాపు రూ 77 కోట్ల డబ్బుని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు ఎలాంటి లెక్కలు లేకపోవడంతో అధికారులు స్వాధీనపరుచుకున్నట్లు తెలుస్తోంది.  అక్రమ నగదుపై నటుడు విజయ్ కి అధికారులు సమన్లు జారీ చేశారు.

ఏజీఎస్ తో పాటు ఫైనాన్షియర్ అన్బుకి కూడా నోటీసులు పంపించారు. విచారణకు హాజరు కావాలని విజయ్ కి ఆదేశాలు జారీ చేయగా.. విజయ్ రాలేనని చెప్పినట్లు తెలుస్తోంది. 'మాస్టర్' సినిమా షూటింగ్ లో ఉన్న కారణంగా విచారణకు హాజరు కలేనని విజయ్ అధికారులకు సమాచారమిచ్చారు. విచారణకు హాజరు కావడానికి విజయ్ కొంతసమయం కోరే అవకాశం ఉంది.   

విజయ్ పై ఐటీ దాడుల వెనుక బిజెపి ప్రభుత్వ కక్షపూరిత చర్య కారణమని విజయ్ అభిమానులు భావిస్తున్నారు. గతంలో విజయ్ మెర్సల్ చిత్రంలో నటించాడు. ఆ చిత్రం సంచలన విజయం అందుకుంది. ఆ చిత్రంలో విజయ్ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీని వ్యతిరేకిస్తూ చెప్పిన డైలాగులు వివాదంగా మారాయి. ఆ డైలాగుల కారణంగానే బిజెపి ప్రస్తుతం విజయ్ పై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని విజయ్ అభిమానులు అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios