ఇటీవల హైదరాబాద్ లో జరిగిన దిశ హత్యాచారం ఘటన దేశం మొత్తాన్ని కలచివేసింది. ఓ ఆడపిల్లను అత్యంత దారుణంగా రేప్ చేసి తగలబెట్టిన దుర్మార్గులను విడిచిపెట్టడానికి వీళ్లేదని వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు.

సినీ నటుడు, జనసేన అధినేత పవన్  కళ్యాణ్ కూడా ఈ ఘటనపై స్పందించాడు. వైద్యురాలిని అత్యాచారం చేసిన నలుగురిని జైల్లో పెడితే.. జైలు దగ్గరకు వేలమంది వెళ్లి ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారని.. ఢిల్లీ స్థాయిలో ఓ జడ్జి రేప్‌ కేసు గురించి మాట్లాడుతూ మగవాళ్ల మర్మాంగాలను కోసేయండన్నారని.. అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారని అన్నారు.

దిశపై అఘాయిత్యం... నిందితులకు కఠిన శిక్ష పడకూడదనే పవన్ ఆలోచన: ఏపి హోంమంత్రి

ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే.. ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే.. దానికి కారణమైన వ్యక్తిని నలుగురు చూస్తుండగా బెత్తంతో తోలు ఊడిపోయేలా కొట్టాలని పవన్  అన్నారు. ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, కొందరు మహిళా రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. తాజాగా సీనియర్ నటుడు సుమన్ కూడా పవన్ పై విరుచుకుపడ్డారు.

మహిళలపై అత్యాచారం చేసిన వారికి రెండు దెబ్బలు చాలనడం దారుణమని అన్నారు. అలాంటి ఘటనలు వారింట్లో జరిగితే పవన్‌ ఇలాగే అంటారా అని ప్రశ్నించారు.  ఇలాంటి ఘటనల్లో బాధితుల ఆవేదనను అర్థం చేసుకుని మాట్లాడాలని పవన్‌కు హితవు పలికారు.అదే విధంగా అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.