విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటుడు సుబ్బరాజు టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. పలు చిత్రాల్లో సుబ్బరాజు నెగిటివ్ రోల్స్ పోషించి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఖడ్గం, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి చిత్రాలతో సుబ్బరాజు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. 

తాజాగా సుబ్బరాజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. తెలంగాణ ఎంపీ సంతోష్ ప్రారంభించిన మొక్కలు నాటే కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. తాజాగా సుబ్బరాజు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. 

హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ నుంచి సుబ్బరాజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించారు. తన ఇంటి ఆవరణంలో సుబ్బరాజు మొక్కలు నాటారు. ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. 

సుబ్బరాజు బాహుబలి 2లో కీలక పాత్రలో నటించి మెప్పించారు. పోకిరి, మిర్చి, లీడర్, ఆర్య , దూకుడు చిత్రాలు సుబ్బరాజు కెరీర్ లో కీలకమైనవిగా చెప్పొచ్చు.