ముంబై: ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ కు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. పలువురు ప్రముఖులు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. 

తవకు కరోనా వైరస్ సోకిన విషయాన్ని సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా వేదికగా అభిమానులతోనూ అనుచరులతోనూ పంచుకున్నారు. తన మూడ్, స్ఫూర్తి బాగుందని ఆయన చెప్పారు. ఈ రోజు ఉదయం తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలిందని, దాంతో సెల్ఫ్ ఐసోషలేషన్ లోకి వెళ్లానని, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఆయన చెప్పారు. 

ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది మీ సమస్యలను పరిష్కరించడానికి తగిన సమయాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు. మీ కోసం నేను ఎళ్లవేళలా అందుబాటులో ఉంటాననే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన చెప్పారు. 

ఇటీవల ఆయన చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగులో పాల్గొన్నారు సైకిల్ మీద షూటింగ్ కు వెళ్తూ ఆయన కనిపించారు 

భారతదేశంలో శనివారంనాడు 234,692 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ మహమ్మారి వ్యాపించడం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక రోజులో అత్యధిక కరోనా కేసులో నమోదు కావడం ఇదే తొలిసారి. భారతదేశంలో ఇప్పటి వరకు శనివారంనాడు 1,341 మరణాలు సంభవించాయి.