Asianet News TeluguAsianet News Telugu

వలసకార్మికుల కోసం ఏకంగా హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసిన సోను సూద్

యాక్టర్ సోను సూద్ వలసకార్మికుల కోసం ఏకంగా హెల్ప్ లైన్ నెంబర్ నే అందించాడు. ముంబైలో ఉన్నవారైతే హాట్ లైన్ నెంబర్ కి ఫోన్ చేయాలనీ వేరే ప్రాంతంలో చిక్కుకున్నవారైతే వాట్సాప్ నెంబర్ కి డీటెయిల్స్ పంపాలని తెలిపాడు. 

Actor Sonu Sood Starts Helpline Number For Migrant Labourers
Author
Mumbai, First Published May 28, 2020, 8:05 AM IST

సినిమాల్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మనందరికీ సుపరిచితుడైన సోను సూద్ ఈ కరోనా కష్టకాలంలో వలస కూలీలను వారింటికి పంపించడానికి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తన సొంతడబ్బు ఖర్చుబెడుతూ పంపిస్తున్న విషయం తెలిసిందే. 

ఆయన వారి టీం అంతా కలిసి చేస్తున్నా ఇంకా కూడా వలస కార్మికులు చిక్కుకొని ఉంటున్నారని తెలుసుకొన్న ఈ సదరు యాక్టర్ సోను సూద్ ఏకంగా హెల్ప్ లైన్ నెంబర్ నే అందించాడు. ముంబైలో ఉన్నవారైతే హాట్ లైన్ నెంబర్ కి ఫోన్ చేయాలనీ వేరే ప్రాంతంలో చిక్కుకున్నవారైతే వాట్సాప్ నెంబర్ కి డీటెయిల్స్ పంపాలని తెలిపాడు. 

ఇకపోతే... మొన్నే వలస కార్మికులను స్వస్థలాలకు పంపించేందుకు స్పెషల్ గా 10 బస్సులను ఏర్పాటు చేసి, దారిలో వారికి అవసరమైన భోజనంతో పాటు వస్తు సామాగ్రిని కూడా అందించారు. ఆ తరువాత మరిన్ని విడతలుగా చాలామందిని వారివారి ఇండ్లకు పంపించాడు ఈ హీరో. 

కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి పొందిన తరువాత, కర్ణాటకలోని గుల్బర్గాకు సోమవారం మహారాష్ట్రలోని థానే నుండి మొత్తం పది బస్సులు బయలుదేరాయి. వలస కార్మికులను వారి సొంతగూటికి చేర్చేందుకు ఇరు రాష్ట్రాల నుంచి ఆయనే ఫర్మిషన్స్ తీసుకోవడం విశేషం. అంతేకాదు.. ఇతర రాష్ట్రాలకు వెళ్లవలసిన వలస కార్మికుల విషయంలో కూడా తన శాయశక్తులా సహాయం చేస్తానని ఆయన తెలిపారు.

 ‘ప్రతి భారతీయుడు వారి కుటుంబాలు మరియు ప్రియమైనవారితో కలిసి ఉండటానికి అర్హుడు’ అని సోనూసూద్ ఈ సందర్భంగా తెలియజేస్తూ..పది బస్సులలోని వలస కార్మికులకు ప్రేమతో గుడ్ బై చెప్పారు. అలాగే వెళుతున్న వలస కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగజేయకుండా వారి రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని సూచించి, అందుకు అవసరమైన ఫర్మిషన్స్ ని  కూడా ఆయన తీసుకోవడం చెప్పుకోదగ్గ విషయం.

ఇంతకు ముందు కూడా సోనూసూద్.. కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న వైద్యులకు, నర్సులకు, వైద్య బృందాలకు ముంబాయిలోని జుహు ప్రాంతంలోని తన హోటల్‌ ను వాడుకోవడాని ఇచ్చాడు. వాళ్ళు ఎక్కడినుంచో వచ్చి ఉంటారని, వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత అని.. తన హోటల్‌ ఇలా ఉపయోగపడుతున్నందుకు సంతోషంగా ఉందని సోనూ సూద్ తెలిపాడు.

సోనూసూద్ చేస్తున్న పనులని చూసి మీడియా, సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే కరోనాపై పోరాటంలో ఆ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ అనే తేడా లేకుండా అందరు తమ వంతు సహకారం అందిస్తున్న విష‌యం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios