కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 మంచి ఆరంభమే జరిగింది. కానీ రాను రాను షో బోరింగ్ గా మారుతోందనే విమర్శలు ఎక్కువయ్యాయి. కంటెస్టెంట్స్ ముందుగానే బయట సోషల్ మీడియా టీమ్స్ ని సెట్ చేసుకుని రావడం, హౌస్ లోపల చీటికీ మాటికీ అవే టాస్క్ లు కనిపిస్తుండడంతో బిగ్ బాస్ షో లో ఉండాల్సిన ఎంటర్టైన్మెంట్ తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివ బాలాజీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. బిగ్ బాస్ లో ఉండాల్సిన మజా సీజన్ 3లో లేదు. అందుకే ఈ షో చూడడం లేదు అని శివ బాలాజీ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పేశాడు. 

ఆరంభంలో బిగ్ బాస్ 3 కొన్ని ఎపిసోడ్స్ చూశా. నాకు కనెక్ట్ కాలేదు. సినీ షూటింగ్స్ తో ఇప్పుడు షో పూర్తిగా చూడడం మానేశా అని శివబాలాజీ వ్యాఖ్యానించాడు. కంటెస్టెంట్స్ ముందుగానే బయట సోషల్ మీడియా టీమ్స్ ని ఏర్పాటు చేసుకుని పక్కాగా ప్లాన్ తో హౌస్ లోకి అడుగుపెట్టారు. 

టాస్క్ లలో కూడా వారి లెక్కల ప్రకారమే పెర్ఫామ్ చేస్తున్నారు. అందువల్లే షోలో ఎంటర్టైన్మెంట్ తగ్గింది. గత సీజన్స్ తో పోల్చుకుంటే టాస్క్ లు కూడా అభిన్నంగా ఏమీ లేవు. దీనితో చూసిన సినిమానే రెండవసారి చూస్తున్న ప్రేక్షకుల్లో కలుగుతోంది. 

శని, ఆదివారాల్లో నాగార్జున కనిపిస్తుండడంతో ఆమాత్రం అయినా బిగ్ బాస్ షో సాగుతోందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.