Asianet News TeluguAsianet News Telugu

సీనియర్ విలన్ ..డైరక్టర్ గా మారాడు

గత ఇరవై ఏళ్ళకు పైగా విలన్ గానూ, సహాయ నటుడిగా పలు భాషల్లో నటించి మెప్పించారు సత్యప్రకాష్‌. ఇప్పుడాయన ‘ఉల్లాల.. ఉల్లాల’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రంతో సత్యప్రకాష్‌ కుమారుడు నటరాజ్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. 

Actor Satya Prakash Turs director
Author
Hyderabad, First Published Oct 13, 2019, 2:39 PM IST

గత ఇరవై ఏళ్ళకు పైగా విలన్ గానూ, సహాయ నటుడిగా పలు భాషల్లో నటించి మెప్పించారు సత్యప్రకాష్‌. ఇప్పుడాయన ‘ఉల్లాల.. ఉల్లాల’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రంతో సత్యప్రకాష్‌ కుమారుడు నటరాజ్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. నూరిన్‌, అంకిత  హీరోయిన్ . ఎ.గురురాజ్‌ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను  వెంకటేష్‌ ఆవిష్కరించారు.

సత్యప్రకాష్‌ మాట్లాడుతూ ‘‘తెరపైన కళ్లకి కట్టినట్టుగా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. కానీ అవి నిజమా కాదా అనే ఆసక్తికరమైన విషయాలతో సాగే చిత్రమిది. డ్రాగన్‌ ప్రకాష్‌ పోరాటాలు,  శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు ప్రధాన ఆకర్షణ. మా అబ్బాయిని కథా నాయకుడిగా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నా’’ అన్నారు.

‘‘నిర్మాత  గురురాజ్‌ లేకుంటే ఈ సినిమా లేదు. చిన్నప్పటి నుంచి నాన్న నన్నెలా చేయి పట్టి నడిపించారో.. నటనలోనూ అలాగే ముందుండి నడిపించార’’అన్నారు నటరాజ్‌. ‘‘లవర్స్‌ డే’ తర్వాత మా సంస్థ నుంచి వస్తోన్న చిత్రమిది. నవంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత.

దర్శకుడు సత్యప్రకాశ్ మాట్లాడుతూ.. తనను దర్శకుడిగా మార్చినందుకు నిర్మాత గురురాజ్‌కు రుణపడి ఉంటానని అన్నారు. తన కుమారుడు నటరాజ్‌ను దీవించాలని కోరారు. ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచనని హామీ ఇచ్చారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించిన నూరిన్, అంకిత ఆకట్టుకొంటారని పేర్కొననారు.

తారాగ‌ణం : న‌ట‌రాజ్‌, నూరిన్‌, అంకిత‌, గురురాజ్‌, స‌త్య‌ప్ర‌కాష్‌, `బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్‌, పృథ్వీరాజ్‌, `అదుర్స్` ర‌ఘు, జ‌బ‌ర్ధ‌స్త్ న‌వీన్‌, లోబో, మ‌ధు, జ‌బ‌ర్ధ‌స్త్ అప్పారావు, రాజ‌మౌళి, జ్యోతి, గీతాసింగ్‌, జ‌య‌వాణి త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి ఎ.ముత్త‌మ్మ‌,
ఛాయాగ్ర‌హ‌ణం: జె.జి.కృష్ణ‌, దీప‌క్‌,
సంగీతం: జాయ్‌,
ఎడిటింగ్‌: ఉద్ధ‌వ్‌,
నృత్య ద‌ర్శ‌క‌త్వం: శేఖ‌ర్ మాస్ట‌ర్‌, దిలీప్ కుమార్‌,
యాక్ష‌న్‌: డ్రాగ‌న్ ప్ర‌కాష్‌,
ఆర్ట్: కె.ముర‌ళీధ‌ర్‌,
పాట‌లు: కాస‌ర్ల శ్యామ్‌, గురుచ‌ర‌ణ్‌,
క‌థ – స్క్రీన్‌ప్లే – మాట‌లు -నిర్మాత‌: ఎ.గురురాజ్‌,
ద‌ర్శ‌క‌త్వం: స‌త్య‌ప్ర‌కాష్‌.

Follow Us:
Download App:
  • android
  • ios