చిరంజీవి నివాసంలో జరిగిన టాలీవుడ్ ప్రముఖుల చర్చలకు తనని ఎవరూ పిలవలేదని, వాళ్లంతా భూములు పంచుకుంటున్నారా అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. బాలయ్య వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు ఒక్కొకరుగా స్పందిస్తున్నారు. 

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ వివాదంపై స్పందించారు. బాలయ్య బాబు, చిరంజీవి అన్నయ్య ఇద్దరూ తెలుసు. ఎవరినైనా పిలిచి చర్చలు జరిపే పెద్దరికం చిరంజీవిగారికి ఉంది. బహుశా బాలయ్యని మరేదైనా కార్యక్రమానికి ఆహ్వానిస్తారేమో. ఈ వివాదాన్ని ఇలాగే చూడాలి తప్ప అనవసరంగా పెద్దది చేయకూడదు. 

ఆ 5 కోట్లు ఏమయ్యాయి, చిరంజీవి కూడా వెళ్ళాడుగా.. బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇగోలకు పోకూడదు. బాలయ్యకు నేను చెప్పే వాడిని కాదు. కానీ మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా. నాకైతే ఎలాంటి ఇగో సమస్యలు ఉండవు అని ప్రకాష్ రాజ్ అన్నారు. బాలయ్య వ్యాఖ్యల తర్వాత నాగబాబు కౌంటర్ ఇవ్వడం.. ఆ తర్వాత బాలయ్య తరుపున కొందరు మాట్లాడడంతో సమస్య పెద్దదైంది. 

ఈ వివాదం పరిష్కరించడానికి సినీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రభుత్వ గైడ్ లైన్స్ తో మహారాష్ట్ర ప్రభుత్వం షూటింగ్స్ కు అనుమతి ఇచ్చింది. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా షూటింగ్స్ కు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.