తెలుగు చిత్ర పరిశ్రమ ఐక్యతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండవలసిన మా అసోసియేషన్ లో చీలికలు ఏర్పడినట్లు మరోసారి రుజవయ్యింది. గత ఎలక్షన్స్ లో గెలుపొందిన అధ్యక్షుడు నరేష్ అసోసియేషన్ లో వివాదాలు నెలకొన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘుపతి వెంకయ్య నాయుడు జీవితం ఆధారంగా రూపొందుతోన్న సినిమాలో నరేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్నారు.

అయితే ఆ సినిమా విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడిన నరేష్ 'మా' లో నెలకొన్న వాతావరణంపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. "నేను ఒక టర్మ్ వరకే అధ్యక్ష పదవిలో ఉంటాను. ఈ విషయాన్నీ గెలిచినప్పుడే చెప్పని. మా అంటే రాజకీయ పార్టీ కాదు. ఒక సేవా సంస్థ. మెగాస్టార్ చిరంజీవి - కృష్ణంరాజు - మురళీమోహన్ వంటి అనుభవం గల నటుల సహకారంతో అందరిని కోలుకుంటూ ముందుకు సాగుతున్నాను.

'సైరా' చూడరని చిరుకి ముందే చెప్పా కానీ.. నటుడు గిరిబాబు కామెంట్స్!

ఇప్పటివరకు నా పదవి కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించాను. సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఇంకా అనుకున్న పనులు పూర్తవ్వలేదు. 'మా'లో వివాదాలు, ఆధిపత్య పోరు ఉన్న మాట నిజమే. నా రెండేళ్ల టర్మ్ లో ఒక ఏడాది పూర్తయ్యింది. మా అధ్యక్ష పదివి నుంచి దిగిపొమ్మంటే వెంటనే తప్పుకుంటా. ఎవరు నన్ను బయటకు పంపించలేరు. నేను అందరికి అజాత శత్రువును సభ్యుల ఓట్లతో గెలిచిన వ్యక్తిని" అని నరేష్ వివరణ ఇచ్చారు.