తమిళ నటుడు బాలా ఓ నిర్మాత భార్యకి ఫోన్ చేసి తన విడాకుల గురించి చర్చించాడట. దీనికి సంబంధించిన కాల్ రికార్డ్ లీక్ కావడంతో కోలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆయన సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కలిగింది.

తన గురించి వివాదాస్పద వ్యాఖ్యలు బయటకి వస్తున్నాయని.. తనకు చాలా మంది ఫోన్లు చేసి అడుగుతున్నారని చెప్పాడు. నాలుగు నెలల క్రితం తన భార్యతో విడాకులు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశాడు.

ఈ అవమానాన్ని భరించలేకపోతున్నా.. ప్రముఖ దర్శకుడిపై రచయిత ఆరోపణలు!

తన సెక్యురిటీ కోసం కొన్ని ఫోన్ కాల్స్ ని రికార్డ్ చేసి పెట్టుకున్నానని.. ప్రస్తుతం తను నిర్మాత భార్యకి ఫోన్ చేసి మాట్లాడానంటూ ఎవరో ఆడియో లీక్ చేశారని.. అది ఇప్పటిది కాదని.. ఏడాది క్రితంది అంటూ చెప్పుకొచ్చాడు.

తప్పుడు కారణాలతో ఇప్పుడు ఆ ఆడియోను వైరల్ చేస్తున్నారని.. ఆ ఫోన్ కాల్ బయటకి ఎలా వచ్చిందో తెలియదని.. ఎవరో కావాలనే తన ఇమేజ్ కి డ్యామేజ్ కలిగించడానికి ఇలా చేస్తున్నారని అన్నారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చు కానీ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాల మీదనే ఉందని.. ఇతరుల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టాలని అనుకోవడం లేదని అన్నారు.

ప్రస్తుతం తన 'బిలాల్' అనే సినిమాలో నటిస్తున్నానని.. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారని చెప్పాడు. ఇంతకీ ఆ ఫోన్ కాల్ లో ఏముందో, నిర్మాత భార్యతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే విషయాలపై మాత్రం ఆయన స్పందించలేదు.