ముంబై: బాలీవుడ్ లో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ లోని ప్రైవేట్ అతిథి గృహంలో అతను ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఆయన వయస్సు 53 ఏళ్లు.

ఆసిఫ్ బస్రా గురువారం ఉదయం ఆత్మహత్ చేసుకున్నాడని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, పోస్టుమార్టం శుక్రవారం జరుగుతుందని, సూసైడ్ నోట్ ఏదీ లభించలేదని ధర్మశాల ఎస్పీ విముక్త్ రంజన్ చెప్పారు. 

ఆసిఫ్ బస్రా బ్లాక్ ఫ్రైడే, పర్జానియా, ఔట్ సోర్స్ డ్, జాబ్ వుయ్ మెట్, వన్స్ ఆప్ ఆన్ ఏ టైమ్ ఇన్ ముంబాయి, క్యా పో చే, కృష్ 3, ఏక్ విలన్, కాలకాండి, హిచ్కీ వంటి చిత్రాల్లో నటించారు 

హోస్టేజ్ సీజన్ 2 దర్శకుడు సచిన్ కృష్ణ్ ఆసిఫ్ బస్రా మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు చివరగా ఆసిఫ్ బస్రా వెబ్ సిరీస్ హోస్టేజేస్ సీజన్ 2లో కనిపించారు. ఆసిఫ్ బస్రా మృతికి ట్విట్టర్ వేదికగా పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు