Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ కామెంట్స్ :‘ది గోట్ లైఫ్‌ (ఆడు జీవితం)లో నటించి తప్పుచేసా, క్షమించండి

డబ్బుల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ బానిసలా బతికి తప్పించుకొని ఎడారిలో కష్టాలు పడి ఓ వ్యక్తి ఎలా బయటకు వచ్చాడు అనే ఓ నిజమైన కథతో ..

Actor Akef Najem Apologises, Regrets Negative Portrayal Of Saudi Arabia In Aadujeevitham jsp
Author
First Published Aug 28, 2024, 1:14 PM IST | Last Updated Aug 28, 2024, 1:15 PM IST


షాకింగ్ కామెంట్స్ :‘ది గోట్ లైఫ్‌ (ఆడు జీవితం)లో నటించి తప్పుచేసా, క్షమించండి

కొన్నేళ్ల‌పాటు షూటింగ్ జ‌రుపుకొన్న పాన్ ఇండియా చిత్రం ‘ది గోట్ లైఫ్‌ (ఆడు జీవితం). బెన్నీ డానియల్‌ (బెన్యామిన్) రాసిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా... మ‌ల‌యాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార‌న్ (Prithviraj Sukumaran) కీల‌క పాత్ర పోషించారు. ఎప్ప‌ట్నుంచో వార్త‌ల్లో వినిపిస్తూ వ‌చ్చిన ఈ చిత్రం ఆ మధ్యన గురువారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.  తెలుగులో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ  మైత్రీ మూవీ మేక‌ర్స్‌కి చెందిన డిస్ట్రిబ్యూట్  చేసింది.  ఈ సినిమా తెలుగులో పెద్దగా వర్కవుట్ కాకపోయినా, మళయాళంలో ఘన విజయం సాధించింది. అలాగే ఈ సినిమా ఓటిటిలో కూడా రిలీజై మంచి అప్లాజ్ తెచ్చుకుంది. 

అయితే రిలీజైన ఇన్నాళ్ల తర్వాత ఈ సినిమాలో నటించిన అకీమ్ నజీమ్ తాను ఈ సినిమా స్క్రిప్టు పూర్తిగా తెలుసుకోకుండా చేసానని, తప్పు చేసానని, క్షమించమంటూ సోషల్ మీడియాలో  పోస్ట్ పెట్టారు. అందుకు కారణం సౌది అరేబియాని సినిమాలో నెగిటివ్ గా చూపించారనే అభియోగం. ఈ విషయమై సౌది అరేబియాకు చెందిన చాలా మంది మండిపడుతున్నారు. ఈ నటుడు సౌదికి చెందిన వాడు కావటంతో నువ్వెలా నటించావంటు సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. అలాంటివాడిని దేశం నుంచి బహిష్కరించాలంటున్నారు. మరో ప్రక్క ఇతనిపై సౌదీ ప్రభుత్వం బ్యాన్ పెట్టిందని ప్రచారం జరుగుతోంది. 

ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను ఆడు జీవితం పూర్తి స్క్రిప్టు చదవలేదని అన్నారు. తనకు తన పార్ట్ వరకే స్క్రిప్టు చెప్పారని అన్నారు. ఆ కథలో హీరో ఎడారిలో తప్పిపోయి, మరణానికి దగ్గరైతే  ఓ సౌదీ వ్యక్తి రక్షిస్తాడనని, అది నేనే అని చెప్పారు. దాంతో నేను సినిమా చేయటానికి ఓకే చెప్పాను. అది సౌదిల సహజలక్షణం. ఎదుటి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు కాపాడటం అనేది సినిమాలో చూపించబోతున్నారని భావించారని, సినిమా పూర్తై, తెరపై చూసుకుంటే పూర్తి వ్యతికేరంగా ఉందని అన్నారు.  తాను పూర్తి విషయాలు తెలిస్తే సినిమా చేయకపోదని, అలాగే సౌదీ ప్రజలకు క్షమాపణ చెప్పారు. తాను ఎలా పొరబడ్డాను అనేది వివరించే ప్రయత్నం చేసారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios