Asianet News TeluguAsianet News Telugu

‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ లో వర్మ క్యారక్టర్ ఆ సీన్ లోనే?

రామ్ గోపాల్ వర్మ కులాల మధ్య చిచ్చు రేపుతూ చేసిన చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టు తిరిగే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. 

About RGV's Role in Kamma Rajyamlo Kadapa Redlu
Author
Hyderabad, First Published Nov 15, 2019, 9:41 AM IST

ఈ మధ్యకాలంలో  రామ్ గోపాల్ వర్మ తన పంధా మార్చారు.  సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనిపించకపోతే ఏమీ చెయ్యటం లేదు. అది ఓ ట్వీట్ కావచ్చు . ఓ సినిమా కావచ్చు ... ఇప్పుడు నటన కావచ్చు.  ఈ మధ్య అయన సినిమాల పై కన్నా రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్టు అర్దమవుతుంది . మొన్నామధ్య విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి ముందు నుండి వర్మ టీడీపీ అధినేత చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాడు. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓడిపోవడంతో తన ట్వీట్ లకి మరింత డోస్ పెంచాడు వర్మ ... వరుసగా ఎదో ఒక ట్వీట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా సినిమా చేస్తున్నారు. అందులో నటించేస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ కులాల మధ్య చిచ్చు రేపుతూ చేసిన చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టు తిరిగే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమాకి సంబధించిన పాటలను వర్మ రిలీజ్ చేసి సంచలనం క్రియేట్ చేసారు. మరో ప్రక్క ఈ సినిమాలో వర్మ ఓ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఆయన ఖరారు చేసారు కూడా. అయితే వర్మ పోషించే పాత్ర ఏమిటన్నది మాత్రం ఎవరికి క్లారటీ రాలేదు. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో వర్మ.. ఓ టీవీ డిబేట్ లో కనిపించనున్నారు.

అనసూయ చీర కడితే.. చూపు తిప్పుకోలేరంతే..

తన నిజ జీవిత పాత్రనే పోషించనున్నారు. అంటే వర్మ ..వర్మలాగే కనిపిస్తారన్నమాట. కొద్ది సేపు మాత్రమే ఉండే ఈ పాత్రలో వర్మ చెప్పే కొన్ని డైలాగ్స్ హైలెట్ కానున్నాయని సమాచారం. థియోటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చే ఈ డైలాగులు వివాదాస్పందంగా ఉంటాయని, అందుకే వేరే వారి చేత ఆ పాత్రను వేయించకుండా వర్మ తనే స్వయంగా రంగంలోకి దిగి పోషించాడంటున్నారు.

ఇక మిగతా పాత్రల్లో చంద్రబాబు పాత్ర వేసిన వ్యక్తి అచ్చం ఆయన్ని దించేసారు. అలాగే  ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన జగన్ గా నటుడు అజ్మల్ కనిపించనున్నాడు.  అచ్చం జగన్ లాగే అజ్మల్ కనిపిస్తున్నాడు. దండం పెట్టడం, నవ్వడంలో జగన్ ని దింపేశాడు అజ్మల్..  అజ్మల్ రంగం సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ చిత్రం ఈ నెల 29 న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా అనుకున్నంతగా వివాదాస్పదం కాలేదు. జనం లైట్ తీసుకున్నారు.  

 ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’  ట్రైలర్‌ కొద్దిగా వివాదం అయితే రాజేసింది కానీ అంతకు మించి వార్తల్లో నిలవలేకపోయింది. టీడీపీ, వైకాపా పార్టీల పాలిటిక్స్, విజయవాడ రౌడీలు, హత్యా రాజకీయాలు..  చంద్రబాబు, జగన్, లోకేశ్‌, బ్రాహ్మణి, పవన్ కల్యాణ్, మోదీ, అమిత్ షా..  మరెందరో.. అధికారం కోసం ఒకరు, అధికారాన్ని కాపాడుకోడానికి మరొకరు పన్నే పన్నాగాలు, ప్యాకేజీలు, వెన్నుపోట్లు..మొత్తంగా ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని వర్మ  తీసుకొస్తున్నా అని చెప్తున్నా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ఉత్సాహంగా లేరు.  బిజినెస్ కాలేదని తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios